LYRIC
Ye Shwasalo Lyrics by Sirivennela Seetharama Sastry, Music by M.M. Keeravani, Sung by K.S. Chitra, From (Nenunnanu) Movie Song. ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమౌతున్నదో. కె.ఎస్.చిత్ర గారు (“వేణుమాధవా వేణుమాధవా”)
Ye Shwasalo Lyrics
Female: Venumadhavaa… Venumadhavaa
Ye Shwasalo Cherithe
Gaali Gaandharvamauthunnadho ||2||
Ye Movipai Vaalithe
Mouname Mantramouthunnadho
Female: Aa Shwasalo Ne Leenamai
Aa Movipai Mounamai
Ninu Cherani Maadhavaa
Aa Aa Aaa…
Ye Shwasalo Cherithe
Gaali Gaandharvamauthunnadho
Female: Munulaku Theliyani Japamulu Jaripinadhaa
Murali Sakhee
Venukati Brathuka Chesina Punyamidhaa
Thanuvu Niluvuna Tholichina Gaayamule
Thana Janmaki
Tharagani Varamula
Sirulani Thalachinadhaa
Female: Krishnaa Ninnu Cherindhi
Ashtaakshariga maarindhi
Elaa Intha Pennidhi
Vedhuru Thaanu Pondhindhi
Venu Madhavaa Nee Sannidhee
Female: Ye Shwasalo Cherithe
Gaali Gaandharvamauthunnadho
Ye Movipai Vaalithe
Mouname Mantramouthunnadho
Female: Challani Nee Chirunavvulu
Kanapadaka Kanupaapaki
Naluvaipula Nadiraathiri
Edhuravadhaa
Allana Nee Adugula Sadi Vinabadaka Hrudhayaaniki
Alajaditho Anuvanoo Thadabadadhaa
Aaaa
Female: Nuvve Nadupu Paadhamidhi
Nuvve Meetu Naadhamidhi
Nivaaligaa Naa Madhi… Nivedhinchu Nimishamidi
Venumadhava Nee Sannidhee
Gaaggarigarisari…..
(check at Telugu lyrics below)
Female: Radhikaa Hrudhaya Raagaanjali
Nee Paadhamula Vraalu Kusumaanjali
Ee Geethanjali
ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమౌతున్నదో Lyrics
ఆమె: వేణుమాధవా… వేణుమాధవా…
ఏ శ్వాసలో చేరితే
గాలి గాంధర్వమౌతున్నదో || 2 ||
ఏ మోవిపై వాలితే
మౌనమే మంత్రమౌతున్నదో
ఆమె: ఆ శ్వాసలో నే లీనమై
ఆ మోవిపై నే మౌనమై
నిను చేరని మాధవా… ఆఆ ఆఆ
ఏ శ్వాసలో చేరితే
గాలి గాంధర్వమౌతున్నదో
ఆమె: మునులకు తెలియని జపములు జరిపినదా
మురళీ సఖీ
వెనుకటి బ్రతుకున చేసిన పుణ్యమిదా
తనువును నిలువున తొలిచిన గాయములే
తన జన్మకీ
తరగని వరముల సిరులని తలచినదా
ఆమె: కృష్ణా నిన్ను చేరింది
అష్టాక్షరిగ మారింది
ఎలా ఇంత పెన్నిధి
వెదురు తాను పొందింది
వేణుమాధవా నీ సన్నిధీ
ఆమె: ఏ శ్వాసలో చేరితే
గాలి గాంధర్వమౌతున్నదో
ఏ మోవిపై వాలితే
మౌనమే మంత్రమౌతున్నదో
ఆమె: చల్లని నీ చిరునవ్వులు కనపడక… కనుపాపకీ
నలువైపుల నడిరాతిరి ఎదురవదా
అల్లన నీ అడుగుల సడి వినబడక… హృదయానికీ
అలజడితో అణువణువూ తడబడదా
అఆఆ… ఆ ఆ ఆ…
ఆఆ ఆఆ ఆ… ఆ… ఆ… ఆ…
ఆమె: నువ్వే నడుపు పాదమిది
నువ్వే మీటు నాదమిది
నివాళిగా నా మది… నివేదించు నిమిషమిది
వేణుమాధవా నీ సన్నిధీ…
ఆమె: గాగ్గరిగరిసరి గాగ్గరీరి సరి
గపదసాస దపగరిసరి
గపదపదా గపదసదా దాపాగరిగా
దపదసస్స దపదసస్స… దపదరిర్రి దపదరిర్రి
దసరిగరిసరి…
గరిసరిగ గ రి గారిసరిగా
రి స ద ప గగగపాప్ప… గగగదాద్ద… గగగసాస్స
ద ప గ ప గ స రి స రి స రి గ రి స…
ద స రి గ మ ప స గ రి మ గ ప గ స రి స రి గ మ ప ని
స గ ప ద ప స గ స ప ద ప స గ స ప ద
ప ద ప రి స రి ప ద ప రి స రి
ప ద స రి గ రి స గ ప ద స గ గ స రి గ స గా
స రి గ ప ద స రి గా… ఆ ఆ ఆ…
ఆమె: రాధికా హృదయ రాగాంజలీ
నీ పాదముల వ్రాలు కుసుమాంజలి
ఈ గీతాంజలి…
Comments are off this post