LYRIC

Vishnu Manohari Lyrics In Telugu Devotional Song From Lakshmi Devi పాట. విష్ణు మనోహరి చంద్ర సహోదరి శ్రీమహలక్ష్మి హరిదేవేరి.

Vishnu Manohari Lyrics In Telugu

విష్ణు మనోహరి చంద్ర సహోదరి Lyrics

విష్ణు మనోహరి చంద్ర సహోదరి
శ్రీమహలక్ష్మి హరిదేవేరి
క్షీరాబ్ధి కన్యా సౌభాగ్యదాయిని
శ్రీ అష్టలక్ష్మి పాలించవమ్మా
జయ జయ శ్రీహరి హృదయ నివాసిని
సురవర మునీంద్ర వందిత జనని
పంకజ వాసిని మంజుల భాషిణి
శ్రీమహలక్ష్మి నమోస్తుతే

ఆదిలక్ష్మివై అలరే తల్లి
శ్రీ వరలక్ష్మి వైకుంఠవాసిని
శ్రీ శ్రీనివాసుని హృదయ నివాసిని
శ్రీ ఆదిలక్ష్మి వందనమమ్మా
జయ జయ శ్రీహరి హృదయ నివాసిని
సురవర మునీంద్ర వందిత జనని
పంకజ వాసిని మంజుల భాషిణి
శ్రీమహలక్ష్మి నమోస్తుతే

ధాన్యలక్ష్మివై ధాత్రిని వెలసి
సిరులనుగాచే దయా తరంగిణి
బంగరు పంటల భాగ్యము నొసగే
శ్రీ సస్యలక్ష్మి కరుణించవమ్మా
జయ జయ శ్రీహరి హృదయ
నివాసిని
సురవర మునీంద్ర వందిత జనని
పంకజ వాసిని మంజుల భాషిణి
శ్రీమహలక్ష్మి నమోస్తుతే

ధైర్యలక్ష్మివై శోభిల్లు జనని
భయనివారిణి అభయప్రదాయిని
ధైత్యనివారిణి ధర్మపరాయణి
శ్రీవీరలక్ష్మీ కృపచూపవమ్మా
జయ జయ శ్రీహరి హృదయ నివాసిని
సురవర మునీంద్ర వందిత జనని
పంకజ వాసిని మంజుల భాషిణి
శ్రీమహలక్ష్మి నమోస్తుతే

సర్వ సౌభాగ్య సంపదలొసగే
శ్రీగజలక్ష్మీ కమల నివాసిని
అమృతమయమగు నీ వీక్షణతో
మమ్మేలువమ్మా శ్రీ స్వర్గలక్ష్మీి
జయ జయ శ్రీహరి హృదయ నివాసిని
సురవర మునీంద్ర వందిత జనని
పంకజ వాసిని మంజుల భాషిణి
శ్రీమహలక్ష్మి నమోస్తుతే

సంతానలక్ష్మిగా విలసిల్లు తల్లి
ఈ జగమంతా నీమయమమ్మా
సత్సంతాన సౌభాగ్యమొసగే
సంతానలక్ష్మి మము బ్రోవమమ్మా
జయ జయ శ్రీహరి హృదయ నివాసిని
సురవర మునీంద్ర వందిత జనని
పంకజ వాసిని మంజుల భాషిణి
శ్రీమహలక్ష్మి నమోస్తుతే

విజయలక్ష్మిగా విశ్వమునేలే
విశ్వాంతరంగిణి శ్రీహరిరాణి
నీకృప గలిగిన జన్మమే ధన్యం
శ్రీవిజయలక్ష్మి దయచూపుమమ్మా
జయ జయ శ్రీహరి హృదయ నివాసిని
సురవర మునీంద్ర వందిత జనని
పంకజ వాసిని మంజుల భాషిణి
శ్రీమహలక్ష్మి నమోస్తుతే

వాణి సరస్వతి శ్రీగీర్వాణి
విజ్ఞానదాయిని వీణాపాణి
సంగీత సాహిత్య సారము నీవే
విద్యాలక్ష్మి శరణం శరణం
జయ జయ శ్రీహరి హృదయ నివాసిని
సురవర మునీంద్ర వందిత జనని
పంకజ వాసిని మంజుల భాషిణి
శ్రీమహలక్ష్మి నమోస్తుతే

సిరి సంపదలతో భక్తుల బ్రోచే
శ్రీధనలక్ష్మి ఐశ్వర్యధాయిని
మనసున నిన్నే నమ్మితిమమ్మా
శ్రీకనకలక్ష్మి కరుణించవమ్మా
జయ జయ శ్రీహరి హృదయ నివాసిని
సురవర మునీంద్ర వందిత జనని
పంకజ వాసిని మంజుల భాషిణి
శ్రీమహలక్ష్మి నమోస్తుతే

శుక్రవారమున తొలిసంధ్య వేళ
నిను కొలుచువారల బ్రోచెదవమ్మా
సకల సంపదలు సౌభాగ్యములను
ప్రసాదించుమా సౌభాగ్యలక్ష్మి
జయ జయ శ్రీహరి హృదయ నివాసిని
సురవర మునీంద్ర వందిత జనని
పంకజ వాసిని మంజుల భాషిణి
శ్రీమహలక్ష్మి నమోస్తుతే

అష్టకష్టములు బాపే తల్లి
అష్టైశ్వర్యములొసగే తల్లి
అష్టరూపముల అలరే తల్లి
శ్రీ అష్టలక్ష్మీ మాం పాహి పాహి
జయ జయ శ్రీహరి హృదయ నివాసిని
సురవర మునీంద్ర వందిత జనని
పంకజ వాసిని మంజుల భాషిణి
శ్రీమహలక్ష్మి నమోస్తుతే
శ్రీ మహలక్ష్మి నమోస్తుతే
శ్రీ మహలక్ష్మి నమోస్తుతే

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO