LYRIC

Vachindamma Lyrics by Shree Mani, Music by Gopi Sundar, tha sung by Sid Sriram, from tha “గీత గోవిందం” Movie Song వచ్చిందమ్మా వచ్చిందమ్మాతెల్ల తెల్లవారే వెలుగు రేఖలా

Vachindamma Lyrics In Telugu & English

Male: Thella Thella Vaare Velugu Rekhala
Pachha Pachha Pachhi Matti Bommalaa
Alli Billi Vennapaala Nurugalaa
Achha Telugu Inti Poola Kommalaa

Male: Deva Devude Pampagaa
Ilaa Devathe Maa Inta Aduge Pettenanta
Brahma Kallalo Kaanthule
Maa AmmaLaa Maa Kosam Malli Laali Padenanta

Chorus: Vachindamma Vachindamma
Edo Ruthuvai Bomma
Haarathi Pallem Haayiga Navve Vadinamma
Vachindamma Vachindamma
Ningina Chukkala Remma
Nattintlona Nelavanka Ika Nuvvammaa

Male: Thella Thella Vaare Velugu Rekhala
Pachha Pachha Pachhi Matti Bommalaa

Female: Saampradhayanee Shuddhapadmini
Prema Shravanee Sarvanee

Male: Edha Chappudu Kadire Medaalo Thaalavanaa
Prathi Nimisham Aayuvune Penchainaa
Kunukappudu Kudhire Nee Kannulalona
Kalalanni Kaatukaanai Chadhivena

 Chinni Navvu Chaale NangaNaachi Koona
Mullokaallu Minge Moothi Mudupu Dhanaa
Indradhanassu Dhaachi Rendu Kallallonna
Nidra Cheripesthaave Ardha Raathirirainaa

Male: Ye Raakaasi Raasho Needhi
Ye Gadiyallo Puttaave Ainaa

Chorus: Vachindamma Vachindamma
Edo Ruthuvai Bomma
Male: Naa Oohallona Ooregindhi Nuvvammaa
Vachindamma Vachindamma

Male: Ningina Chukkala Remma
Naa Brahmachaaryam Baaki
Cheripesindhammaa
 Ekaanthalannee Ekaantham Leka
Ekaruve Pettaaye Ekangaa
Santhoshaalannee Selavannadhi Leka
Manathone Koluvayye Motthangaa

Male: Swagathaalu Leni Ontlo Unda Leka
Viraham Kanumarugayye Manatho Vegaleka
Kashtam Nashtam Ane Sontha Vaallu Raaka
Kanneerontaraaye Niluva Needa Leka
Entha Adrushtam Naadhenantu
Pagabattindhe Naapai Jagamanthaa

Male: Nachhindamma Nachhindamma
Nachindamma Janma
Neelo Sagamai Brathike
Bhaagyam Naadhamma
Mechhindhamma Mechhindhamma

Male: Nodhutuna Kumkuma Bomma
O Veyyellaayushhantu Dheevinchindammaa
Thella Thella Vaare Velugu Rekhala
Pachha Pachha Pachhi Matti Bommalaa
Alli Billi Vennapaala Nurugalaa
Achha Telugu Inti Poola Kommalaa

వచ్చిందమ్మా వచ్చిందమ్మా Lyrics

ఆతడు: తెల్ల తెల్లవారే వెలుగు రేఖలా
పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా
అల్లి బిల్లి వెన్నపాల నురగలా
అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మలా

ఆతడు: దేవ దేవుడే పంపగా
ఇలా దేవతే మా ఇంట అడుగే పెట్టేనంట
బ్రహ్మ కళ్ళలో కాంతులే
మా అమ్మలా మా కోసం మళ్ళీ లాలి పాడేనంట

కోరస్: వచ్చిందమ్మా వచ్చిందమ్మా
ఏడో ఋతువై బొమ్మ
హారతి పల్లెం హాయిగ నవ్వే వదినమ్మా
వచ్చిందమ్మా వచ్చిందమ్మా
నింగిన చుక్కల రెమ్మ
నట్టింట్లోన నెలవంక ఇక నువ్వమ్మా

ఆతడు: తెల్ల తెల్లవారే వెలుగు రేఖలా
పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా

ఆమె: సాంప్రదాయనీ శుద్ధపద్మిని
ప్రేమ శ్రావణీ సర్వాణీ

ఆతడు: ఎద చప్పుడు కదిరే మెడలో తాలవనా
ప్రతి నిమిషం ఆయువునే పెంచైనా
కునుకప్పుడు కుదిరే నీ కన్నులలోన
కలలన్నీ కాటుకనై చదివేనా

ఆతడు: చిన్ని నవ్వు చాలే నంగనాచి కూనా
ముల్లోకాలు మింగే మూతి ముడుపు దానా
ఇంద్రధనసు దాచి రెండు కళ్ళల్లోన
నిద్ర చెరిపేస్తావే అర్థరాతిరైనా

ఆతడు: ఏ రాకాసి రాశో నీది
ఏ ఘడియల్లొ పుట్టావె ఐనా

కోరస్: వచ్చిందమ్మా వచ్చిందమ్మా
ఏడో ఋతువై బొమ్మ
ఆతడు: నా ఊహల్లోన ఊరేగింది నువ్వమ్మా
వచ్చిందమ్మా వచ్చిందమ్మా
నింగిన చుక్కల రెమ్మ
 నా బ్రహ్మచర్యం బాకీ చెరిపేసిందమ్మా

ఆతడు: ఏకాంతాలన్నీ ఏకాంతం లేక
ఏకరువే పెట్టాయే ఏకంగా
సంతోషాలన్నీ సెలవన్నది లేక
మనతోనే కొలువయ్యే మొత్తంగా
స్వాగతాలు లేని ఒంట్లో ఉండలేక
విరహం కనుమరుగయ్యే మనతో వేగలేక
కష్టం నష్టం అనే సొంతవాళ్ళు రాక
కన్నీరొంటరాయే నిలువ నీడ లేక
ఎంతదృష్టం నాదేనంటూ
పగబట్టిందే నాపై జగమంతా

ఆతడు: నచ్చిందమ్మా నచ్చిందమ్మా నచ్చిందమ్మా జన్మా
నీలో సగమై బ్రతికే భాగ్యం నాదమ్మా
మెచ్చిందమ్మా మెచ్చిందమ్మా
నుదుటున కుంకమ బొమ్మ
ఓ వెయ్యేల్లాయుష్షంటూ దీవించిందమ్మా

ఆతడు: తెల్ల తెల్లవారే వెలుగు రేఖలా
పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా
అల్లి బిల్లి వెన్నపాల నురగలా
అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మలా

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO