LYRIC

Tarali Raada Lyrics by Sirivennela Seetharama Sastry, Music by Ilayaraja, Sung by SP. Balasubramanyam, From Rudraveena Movie Song తరలి రాద తనే వసంతం తన దరికి రాని వనాల కోసం.

Tarali Raada Lyrics

Tarali Raada Tane Vasantham
Tana Dariki Raani Vanaala Kosam
Tharali Raadha Thane Vasantham
Thana Dhariki Raani Vanaala Kosam

Gaganaala Daaka… Ala Saagakunte
Meghaala Raagam… Ila Cherukodhaa
Tharali Raadha Thane Vasantham
Thana Dhariki Raani Vanaala Kosam

Vennela Deepam Kondaridhaa
Adavini Saitham Velugu Kadhaa
Vennela Deepam Kondaridhaa
Adavini Saitham Velugu Kadhaa
Ellalu Leni Challani Gaali
Andari Kosam Andhunu Kaadhaa

Prathi Madhini Lepe Prabhaatha Raagam
Padhe Padhe Choope Pradhaana Maargam
Edhi Sontham Kosam Kaadhanu Sandesham
Panche Guname Pothe… Prapanchame Shoonyam

Idhi Teliyani Manugada Kadha
Dhishanerugani Gamanamu Kadha
Tharali Raadha Thane Vasantham
Thana Dhariki Raani Vanaala Kosam

Brathukuna Leni Shruthi Kaladaa
Yadhasadilone Laya Ledhaa
Brathukuna Leni Shruthi Kaladaa
Yadhasadilone Laya Ledhaa
Ye Kalakainaa… Ye Kalakainaa
Jeevitha Rangam Vedhika Kaadhaa

Prajadhanam Kaani Kalaavilaasam
Ye Prayojanam Leni Sudhavikaasam
Koose Koyila Pothe… Kaalam Agindhaa
Paade Ene Paade… Maro Padham Raadhaa
Muraliki Gala Swaramula Kala
Pedavini Vidi Palakadhu Kadha

Tarali Raada Tane Vasantham
Tana Dariki Raani Vanaala Kosam
Tharali Raadha Thane Vasantham
Thana Dhariki Raani Vanaala Kosam

Gaganaala Daaka… Ala Saagakunte
Meghaala Raagam… Ila Cherukodhaa
Tharali Raadha Thane Vasantham
Thana Dhariki Raani Vanaala Kosam

తరలి రాద తనే వసంతం తన దరికి రాని వనాల కోసం Lyrics

తరలి రాద తనే వసంతం
తన దరికి రాని వనాల కోసం
తరలి రాద… తనే వసంతం
తన దరికి రాని… వనాల కోసం

గగనాల దాకా… అల సాగకుంటే
మేఘాల రాగం… ఇల చేరుకోదా
తరలి రాద తనే వసంతం
తన దరికి రాని వనాల కోసం

వెన్నెల దీపం కొందరిదా
అడవిని సైతం… వెలుగు కదా
వెన్నెల దీపం కొందరిదా
అడవిని సైతం… వెలుగు కదా
ఎల్లలు లేని చల్లని గాలి
అందరి కోసం అందును కాదా

ప్రతి మదిని లేపే ప్రభాత రాగం
పదే పదే చూపే ప్రధాన మార్గం
ఏదీ సొంతం కోసం… కాదను సందేశం
పంచే గుణమే పోతే… ప్రపంచమే శూన్యం

ఇది తెలియని… మనుగడ కధ
దిశనెరుగని గమనము కద
తరలి రాద తనే వసంతం
తన దరికి రాని వనాల కోసం

బ్రతుకున లేని… శృతి కలదా
యదసడిలోనే లయ లేదా
బ్రతుకున లేని… శృతి కలదా
యదసడిలోనే లయ లేదా
ఏ కళకైనా… ఏ కలకైనా
జీవిత రంగం వేదిక కాదా

ప్రజాధనం కానీ కళావిలాసం
ఏ ప్రయోజనం లేనీ సుధావికాసం
కూసే కోయిల పోతే… కాలం ఆగిందా
పాడే ఏనే పాడే… మరో పదం రాదా
మురళికి గల స్వరముల కళ
పెదవిని విడి పలకదు కద

తరలి రాద తనే వసంతం
తన దరికి రాని వనాల కోసం
తరలి రాద… తనే వసంతం
తన దరికి రాని… వనాల కోసం

గగనాల దాకా… అల సాగకుంటే
మేఘాల రాగం… ఇల చేరుకోదా
తరలి రాద తనే వసంతం
తన దరికి రాని వనాల కోసం

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO