Andamaina Sandamama
Sitkelo Semanthi Komma
Sekkumannadhe
Vayyaare Vayyaari Jaana
Pelli Kuthuraayenamma Pallakilone
విరేనా రామ సక్కని జంట Lyrics
ఆమె: అందామైన సందామామ
సిట్కేలో సేమంతి కొమ్మ సెక్కూమన్నదే
వయ్యారే వయ్యారి జాణా
పెళ్ళీ కూతురాయేనమ్మ పల్లకీలోనే
యే, పట్టూసీరె గట్టి పాపిటిబిళ్ళానే వెట్టి
మస్తుగ ముస్తాబయిందే
కళ్ళకు కాటుకెట్టి, సీరె కుచ్చులు చేతవట్టి
కాళ్ళకు పారణద్ధిందే ఏ ఏ
వచ్చిండే పిల్లా నిన్నే నచ్చిన సిన్నోడే
నచ్చంగా ముచ్చటగుండె జంటలు మీవేలే
వచ్చిండే పిల్లా నిన్నే నచ్చిన సిన్నోడే
నచ్చంగా ముచ్చటగుండె జంటలు మీవేలే
విరేనా రామ సక్కని జంట
సూడ ముచ్చటయంట
సూసి మురిసేరంతా ||4||
అందామైన సందామామ
సిట్కేలో సేమంతి కొమ్మ సెక్కూమన్నదే
వయ్యారే వయ్యారి జాణా
పెళ్ళీ కూతురాయేనమ్మ పల్లకీలోనే
ఆమె: నీ సక్కని నవ్వులతో
ఇల్లే విరబూసేనమ్మా అందాల యువరాణి
మనసే మురిసెనమ్మా
హరివిల్లై విరిసెనమ్మా, మా ఇంటి రంగుల వోణి
బంగారు ముద్దులగుమ్మకు బాసింగమాయె
బాజాంత్రీలు సన్నాయిమేళంతో సందడి చెయ్యాలి
చుట్టాల గుండెల నిండా సంబురమవ్వాలి
నిండైనా దీవెనతో మండపమే మురవాలి
విరేనా రామ సక్కని జంట
సూడ ముచ్చటయంట
సూసి మురిసేరంతా ||4||
నిన్నుకోరొచ్చినోడే
నిన్నే తెగ మెచ్చినాడే
నిండైనా మనసుగల్లోడే
నీలో సగమయ్యి
నీ పెనిమిటి అయ్యెను సూడే
సక్కంగా ఈ ముద్దుల జంట
సుఖంగుండాలి
నూరేండ్లు ఆ దేవుళ్లందరి
దీవెన ఉండాలి
సక్కంగా ఈ ముద్దుల జంట
సుఖంగుండాలి
నూరేండ్లు ఆ దేవుళ్లందరి
దీవెన ఉండాలి
విరేనా రామ సక్కని జంట
సూడ ముచ్చటయంట
సూసి మురిసేరంతా ||4||.
Comments are off this post