LYRIC

Rangu Seethammo Part 7 Lyrics by Parshuram Nagam, Music by Praveen Kaithoju, Singers by Boddu Dilip & Lavanya, From Telangana Folk Song Rangu Seethamma రంగు సీతమ్మో ఉండి లేనట్టు ఉంది లేకా ఉన్నట్టు ఉంది.

Rangu Seethammo Part 7 Lyrics

రంగు సీతమ్మో Lyrics

ఉండి లేనట్టు ఉంది
లేకా ఉన్నట్టు ఉంది
కండ్లనిండ గురుతుంది
మాయమై పోతవుందె
రంగు సీతమ్మో

గుండెల్ల దాసుకున్న
బిడ్డ నవ్వు గురుతుంది
కండ్లల్ల నిలుపుకున్న
నీ ప్రేమ భలేగుంది
నాయి రామయ్యో

నీ సేతుల పెంచుకున్న
నా భుజమున ఎత్తుకున్న
ఈ గలుమల సాదుకున్న
వాకిట్ల నడుపుకున్న మరిసిపోనమ్మో

ఆడవాళ్ళ తలరాత
అంతులేని గుండేత
మన ఇంటి మా లచ్చిమి
పరాయోళ్ల కోడలేగా
నాయి రామయ్యో

కుడిబంధు పెద్ద బిడ్డ
కూనీరాగాల బిడ్డ
ఎడమ బంధు సిన్నబిడ్డ
ఎగిరి ఆడేది బిడ్డ, యాదికున్నయే

సెరువు నిండిన నీళ్ళు
అలుగు దుంకి ఆగు దాటె
గుండె నిండినా ప్రేమ
లగ్గమాయి ఎల్లిపోయె
తిరిగి రాదయ్యో

గుండెను బండను జేద్దాం
బాధలు బంధూకేద్దాం
గుండెల గురుతులు దాద్దాం
పిలిసి ధావతు జేద్దాం
కబురు పంపమ్మో

పెద్దల్లుడు పెద్ద బిడ్డ
మన పిలుపు కాదనరు
సిన్నల్లుడు సిన్నబిడ్డ
అడుగంగనే వత్తారు
నా ఈ రామయ్యో

రావయ్యా పెద్దల్లుడ
మా ఇంటి పెద్ద కొడుక
రావమ్మా పెద్ద బిడ్డ
రందిపడ్డదే బిడ్డ, బెంగ పెట్టకే

రావయ్యా సిన్నల్లుడ
మా బలమే నీవయ్యా
సింగారి సిన్న బిడ్డ
బంగారి బొమ్మవమ్మ, నా ఈ బిడ్డో

కాళ్ళు కడిగె నీళ్ళిదిగో
సేతుల తువ్వాలిదిగో
సెంబునిండ నీళ్ళిదిగో
సల్ల పెరుగు కురుదులిదిగో బిడ్డల్లారా

ఆకులల్ల కూరలిదిగో
సీసాలల్ల కల్లు ఇదిగో
ఇంటినిండా పండుగిదిగో
కడుపునిండా బువ్వ ఇదిగో అల్లుండ్లారా

పొద్దూ పొడవకముందే
కోడి కూయకాముందే
రెండొద్దులు కాకముందె
రోదనలు మాకు పెట్టి, ఎల్లబడితిరా

బిడ్డలొచ్చి మొన్నగాయె
బుద్దన్నా తీరపాయె
అల్లుండ్లు వచ్చినారె
ఆత్మన్నా ఆగదాయే
నా ఈ రామయ్యో

మా సెత్తా ఇంటికాడ
పాణమంత మీ మీద
జీవితాలు ఇంటికాడ
బిడ్డల్లారా

క్షేమంగా వెళ్ళిరండి
లాభంగా మళ్ళీరండి
నేడు పోయి రేపు రండి
రెండొద్దులు ఉండిపోండి, అల్లుండ్లారా
మీకు దండం పెడతా దయగల్ల బిడ్డ
పోయి రావమ్మా…

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO