LYRIC
Punya Bhoomi Naa Desam Lyrics Major Chandrakanth Movie Song
Singer: S P Balasubramanyam
Music: M M Keeravani
Lyrics: Jaladi Raja Rao
Punya Bhoomi Naa Desam Lyrics In Telugu
అతడు: పుణ్యభూమి నా దేశం నమో నమామీ
ధన్య భూమి నా దేశం సదా స్మరామీ || 2 ||
నన్ను కన్న నా దేశం నమో నమామీ
అన్నపూర్ణ నా దేశం సదా స్మరామీ
మహామహుల కన్న తల్లి నా దేశం
మహోజ్వలిత చరిత కన్న భాగ్యోదయ దేశం, నా దేశం
పుణ్యభూమి నా దేశం నమో నమామీ
ధన్య భూమి నా దేశం సదా స్మరామీ
అతడు: అదిగో ఛత్రపతీ… ధ్వజమెత్తిన ప్రజాపతి
మతోన్మాద శక్తులు చురకత్తులు జడిపిస్తే
మానవతుల మాంగళ్యం మంట కలుపుతుంటే
ఆఆ ఆ, ఆ క్షుద్ర రాజకీయానికి…
రుద్రనేత్రుడై లేచి
మాతృభూమి నుదిటిపై నెత్తురు తిలకం దిద్దిన
మహా వీరుడు సార్వభౌముడు
అతడు: అడుగో అరి భయంకరుడు కట్ట బ్రహ్మన
అది వీరపాండ్య వంశాంకుర సింహ గర్జన || 2 ||
అతడు: ఒరెయ్..! ఎందుకు కట్టాలిరా శిస్తు..?
నారు పోశావా? నీరు పెట్టావా?
కోత కోశావా? కుప్పలూడ్చావా…?
ఒరెయ్…! తెల్ల కుక్క…!
కష్ట జీవుల ముష్టి తిని బ్రతికే నీకు…
శిస్తెందుకు కట్టాలి రా..?
అతడు: అని పెల పెల సంకెళ్ళు తెంచి
స్వరాజ్య పోరాటమెంచి
ఉరికొయ్యల ఉగ్గు పాలు తాగాడు
కన్న భూమి ఒడిలోనే ఒరిగాడు
పుణ్యభూమి నా దేశం నమో నమామీ
కోరస్: ధన్య భూమి నా దేశం సదా స్మరామీ
నన్ను కన్న నా దేశం నమో నమామీ
అన్నపూర్ణ నా దేశం సదా స్మరామీ
కోరస్: అదిగదిగో అదిగదిగో… ఆకాశం భళ్ళున తెల్లారి
అతడు: వస్తున్నాడదిగో మన అగ్గి పిడుగు అల్లూరి
కోరస్: అగ్గి పిడుగు అల్లూరి
అతడు: ఎవడురా నా భరత జాతిని…
తత్వమడిగిన తుచ్చుడు
ఎవడు ఎవడా పొగరు బట్టిన తెల్ల దొర గాడెవ్వడు
బ్రతుకు తెరువుకు దేశమొచ్చి…
బానిసలుగా మమ్మునెంచి
పన్నులడిగే కొమ్ములొచ్చిన…
దమ్ములెవడికి వచ్చెరా
బడుగు జీవులు భగ్గుమంటే…
ఉడుకు నెత్తురు ఉప్పెనైతే
ఆ చండ్ర నిప్పుల గండ్ర గొడ్డలి…
పన్ను కడతది చూడరా
అతడు: అన్న, ఆ మన్నెం దొర అల్లూరిని
చుట్టు ముట్టి మంది మార్బలమెట్టి
మర ఫిరంగులెక్కు పెట్టి
వంద గుళ్ళు ఒక్కసారి పేల్చితే
వందేమాతరం… వందేమాతరం || 2 ||
వందేమాతరం అన్నది ఆ ఆకాశం
అతడు: ఆజాదు హిందు ఫౌజు దళపతి నేతాజి
అఖండ భరత జాతి కన్న మరో శివాజి
సాయుధ సంగ్రామమే న్యాయమని
స్వతంత్ర భారతావని మన స్వర్గమని
ప్రతి మనిషొక సైనికుడై ప్రాణార్పన చెయ్యాలని
హిందు ఫౌజు జైహింద్ అని గడిపాడు
గగన సిగలకెగసి కనుమరుగై పోయడు
కోరస్: జోహార్ జోహార్… సుభాష్ చంద్ర బోస్
జోహార్ జోహార్… సుభాష్ చంద్ర బోస్
అతడు: గాంధీజీ కలలు కన్న స్వరాజ్యం
సాదించే సమరంలో అమర జ్యోతులై వెలిగే
ద్రువతారల కన్నది ఈ దేశం
చరితార్దులకన్నది నా భారత దేశం, నా దేశం
అతడు: పుణ్యభూమి నా దేశం నమో నమామీ
ధన్య భూమి నా దేశం సదా స్మరామీ
నన్ను కన్న నా దేశం నమో నమామీ
అన్నపూర్ణ నా దేశం సదా స్మరామీ
Punya Bhoomi Naa Desam Lyrics English
Male: Punyabhumi Nadesam Namo Namaami
Dhanyabhumi Nadesam Sadaa Swaraami || 2 ||
Nannu Kanna Naa Desham Namo Namaami
Annapoorna Naa Desham Sadaa Smaraami
Mahaamahula Kanna Thalli Naa Desham
Mahojwalitha Charitha Kanna
Bhagyodhaya Desham, Naa Desham
Male: Punyabhoomi Naa Desam
Namo Namaami
Dhanyabhoomi Naa Desam
Sadaa Swaraami
Male: Adhigo Chatrapathi
Dwajametthina Prajaapathi
Mathonmaadha Shakthulu
Churakatthulu Jadipisthe
Male: Maanavathula Maangalyam
Manta Kaluputhunte
Aa AaAa, Kshudra Raajakiyaaniki
Rudhranethrudai Lechi
MaathruBhoomi Nudhitipai
Netthuru Thilakam Dhiddina
Mahaa Veerudu Saarwabhaumudu
Male: Adugo Ari Bhayankarudu… Katta Brahmmana
Adhi Veera Paandya Vamshaankura Simha Garjana
Chorus: Adugo Ari Bhayankarudu… Katta Brahmmana
Adhi Veera Paandya Vamshaankura Simha Garjana
Male: Orey..! Enduku Kattaaliraa Shisthu..?
Naaru Poshaava? Neeru Pettaavaa?
Kotha Koshaavaa? Kuppaloodchaavaa..?
Orey..! Thella Kukka
Kashta Jeevula Mushti Thini Brathike Neeku…
Shisthenduku KattaaliRaa..?
Male: Ani Pela Pela Sankellu Tenchi
Swarajjya Poraatamenchi
Urikoyyala Uggu Paalu Thaagaadu
Kanna Bhoomi Odilone Origaadu
Male: Punyabhoomi Naa Desam Namo Namaami
Dhanyabhoomi Naa Desam Sadaa Swaraami
Nannu Kanna Naa Desham Namo Namaami
Annapoorna Naa Desham Sadaa Smaraami
Chorus: Adhigadhigo, Adhigadhigo
Aakasham Bhalluna Thellaari
Male: Vasthunnaadadhigo Mana
Chorus: Aggi Pidugu Alloori
Male: Evaduraa Naa Bharatha Jaathini
Thathwamadigina Thuchhudu
Evadu Evadaa Pogaru Battina
Thella Dhora Gaadevvadu
Male: Brathuku Theruvuku Deshamochhi
Baanisalugaa Mammunenchi
Pannuladige Kommulochhina
Dhammulevadiki Vachheraa
Male: Badugu Jeevulu Baggumante
Uduku Netthuru Uppenaithe
Aa Chandra Nippula
Gandra Goddali Pannu Kadathadi Choodaraa
Male: Anna, Aa Mannem Dhota Alloorini
Chuttu Mutti… Mandi Maarbhalametthi
Mara Firangulekkupetti… Vandha Gullu Okkasaari Pelchithe
Vande Maatharam… Vande Maataram || 2 ||
Vande Maataram Annadhi Aa Aakaasham
Male: Azad Hind Fauj Dhalapathi Nethaaji
Akhanda Bharatha Jaathi Kanna Maro Shivaji
Saayudha Sangraamame Nyayamani
Swathanthra Bhaarathaavani Mana Swargamani
Male: Prathi Manishoka Sainikudai
Praanaarpana Cheyyaalani
Hind Fauj Jai Hind Ani Gadipaadu
Gagana Sigalakegasi… Kanumarugai Poyaadu
Chorus: Johaar Johaar… Shubhash Chandra Bose
Johaar Johaar… Shubhash Chandra Bose
Male: Gandhijee Kalalu Kanna Swarajyam
Saadhinche Samaramlo Amara Jyothulai Velige
Dhruvathaaralu Kannadhi Ee Desham
Charithaardhulakannadhi
Naa Bharatha Desham, Naa Desham
Male: Punyabhoomi Naa Desam Namo Namaami
Dhanyabhoomi Naa Desam Sadaa Swaraami
Nannu Kanna Naa Desham Namo Namaami
Annapoorna Naa Desham Sadaa Smaraami
పుణ్యభూమి నా దేశం Song Info
Singer | S P Balasubramanyam |
Music | M M Keeravani |
Lyrics | Jaladi Raja Rao |
Star Cast | NTR, Mohan Babu, Nagma, Ramya Krishna |
Song Label |
Comments are off this post