LYRIC
Priyatama Nanu Palakarinchu Lyrics by ప్రియతమా నను పలకరించు ప్రణయమా Song Lyrics by Veturi Sundararama Murthy, Music by Ilaiyaraaja, Singers by S P. Balasubramanyam, S. Janaki From జగదేకవీరుడు అతిలోకసుందరి Movie Song Chiranjeevi, Sridevi.
Priyatama Nanu Palakarinchu Lyrics
Priyathamaa Nanu Palakarinchu Pranayamaa
Athithilaa Nanu Cherukunna Hrudhayamaa
Brathukuloni Bandhamaa
Palukaleni Bhaavamaa
Maruvaleni Snehamaa
Maraliraani Nesthamaa
Priyatama, Priyathama
Priyatamaa, Aa
Priyathamaa Nanu
Palakarinchu Pranayamaa
Athithilaa Nanu Cherukunna Hrudhayamaa
Edhuta Unna Swargamaa
Chedhiriponi Swapnamaa
Kanulaloni Kaavyamaa
Kougilintha Praanamaa
Priyathamaa, Priyathamaa
Priyathamaa, Aa
Priyathamaa Nanu Palakarinchu Pranayamaa
Ningi Veenakemo Nela Paatalochhe
Telugu Jilugu Anni Thelisi
Paarijaathapuvvu Pachhi Mallemogga
Valape Thelipe Naalo Virisi
Machhalenno Unna Chandhamaama Kannaa
Narude, Varudai Naalo Merise
Thaaralamma Kanna Cheerakattukunna
Paduchudhanamu Naalo Murise
Mabbulani Veedipoyi
Kalise Nayanam, Telise Hrudhayam
Thaalanni Dhaatagaane
Thagile Gaganam, Ragile Viraham
Raayaleni Baashalo… Enni Premalekhalo
Raayilaanti Gonthulo… Enni Moogabapaatalo
Aduge Padaka… Gaduve Gadichi Piliche
Priyatamaa Nanu Palakarinchu Pranayamaa
Athithilaa Nanu Cherukunna Hrudhayamaa
Praanavaayuvedho Venuvoodhi Poye
Shruthilo Jathilo Ninne Kalipi
Devagaanamantha Enki Paatalaaye
Manasu Mamatha Annee Kalisi
Vennelalle Vachhi Vedhamanthramaaye
Bahushaa Manasaa Vaachaa Valachi
Menakalle Vachhi Jaanakalle Maare
Kulamu Gunamu Annee Kudhiri
Neevuleni Nelameedha
Brathuke Pralayam, Manase Maranam
Vaanavillu Gundelo… Neetikenni Rangulo
Amruthaala Vindhulo… Endhukinni Haddhulo
Jagame Anuvai…
Yugame Kshanamai Migile
Priyatama Nanu Palakarinchu Pranayamaa
Athithilaa Nanu Cherukunna Hrudhayamaa
Brathukuloni Bandhamaa
Palukaleni Bhaavamaa
Kanulaloni Kaavyamaa
Kougilintha Praanamaa
Priyatama, Priyatamaa… Priyatama, Aa
Priyatama Nanu Palakarinchu Pranayamaa
Athithilaa Nanu Cherukunna Hrudhayamaa
ప్రియతమా నను పలకరించు ప్రణయమా Lyrics
ఆమె: ప్రియతమా నను పలకరించు ప్రణయమా
అతిథిలా నను చేరుకున్న హృదయమా
బ్రతుకులోని బంధమా… పలుకలేని భావమా
మరువలేని స్నేహమా… మరలిరాని నేస్తమా
ప్రియతమా ప్రియతమా… ప్రియతమా, ఆఆ
అతడు: ప్రియతమా నను పలకరించు ప్రణయమా
అతిథిలా నను చేరుకున్న హృదయమా
ఎదుట ఉన్న స్వర్గమా… చెదిరిపోని స్వప్నమా
కనులలోని కావ్యమా… కౌగిలింత ప్రాణమా
ప్రియతమా ప్రియతమా… ప్రియతమా, ఆఆ
ఆమె: ప్రియతమా నను పలకరించు ప్రణయమా
అతడు: నింగి వీణకేమో నేల పాటలొచ్చె
తెలుగు జిలుగు అన్నీ తెలిసి
పారిజాతపువ్వు పచ్చి మల్లె మొగ్గ
వలపె తెలిపే నాలో విరిసి
ఆమె: మచ్చలెన్నో ఉన్న చందమామకన్నా
నరుడే, వరుడై నాలో మెరిసే
తారలమ్మకన్న చీరకట్టుకున్న
పడుచుతనము నాలో మురిసే
అతడు: మబ్బులనీ వీడిపోయి
కలిసే నయనం, తెలిసే హృదయం
ఆమె: తారలన్ని దాటగానే
తగిలే గగనం, రగిలే విరహం
అతడు: రాయలేని భాషలో… ఎన్ని ప్రేమలేఖలో
ఆమె: రాయిలాంటి గొంతులో… ఎన్ని మూగపాటలో
అడుగే పడక… గడువే గడిచి పిలిచే
అతడు: ప్రియతమా నను పలకరించు ప్రణయమా
ఆమె: అతిథిలా నను చేరుకున్న హృదయమా
ఆమె: ప్రాణవాయువేదో వేణువూదిపోయే
శృతిలో జతిలో నిన్నే కలిపి
దేవగానమంత ఎంకి పాటలాయే
మనసు మమత అన్నీ కలిసి
అతడు: వెన్నెలల్లె వచ్చి వేదమంత్రమాయే
బహుశా మనసా వాచా వలచి
మేనకల్లే వచ్చి జానకల్లే మారె
కులము గుణము అన్నీ కుదిరి
ఆమె: నీవులేని నింగిలోన… వెలిగే ఉదయం, విధికే విలయం
అతడు: నీవులేని నేలమీద… బ్రతుకే ప్రళయం, మనసే మరణం
ఆమె: వానవిల్లు గుండెలో… నీటికెన్ని రంగులో
అతడు: అమృతాల విందులో… ఎందుకిన్ని హద్దులో
జగమే అణువై… యుగమే క్షణమై మిగిలే
ఆమె: ప్రియతమా నను పలకరించు ప్రణయమా
అతడు: అతిథిలా నను చేరుకున్న హృదయమా
ఆమె: బ్రతుకులోని బంధమా… పలుకలేని భావమా
అతడు: కనులలోని కావ్యమా… కౌగిలింత ప్రాణమా
ఇద్దరు: ప్రియతమా ప్రియతమా… ప్రియతమా, ఆఆ
ప్రియతమా నను పలకరించు ప్రణయమా
అతిథిలా నను చేరుకున్న హృదయమా
Comments are off this post