LYRIC
Podusthunna Poddumeeda Lyrics and Song by Gaddar, Music by Chakri, పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా…
Podusthunna Poddumeeda Lyrics
Aa Aa, Podusthunna… Bhale Bhale Bhale Bhale Ha Ho Ha, Aaha
Podusthunna Poddumeeda… Nadusthunna Kaalamaa
Poru Telanganama..!
Poru Telanganamaa… Kotlaadhi Praanamaa
Bhale Bhale Bhale Bhale Ha Ho Ha Ha
Podusthunna Poddumeedha… Nadusthunna Kaalamaa
Poru Telanganamaa..!
Poru Telanganamaa… Kotlaadhi Praanamaa
Kotlaadhi Praanamaa
Oo Bhoothalli, Sooryudini Muddhaadina Bhoothalli
Adhigo Chinnaari Biddalni Janmanichhindhi
Ammaa..! Neevu Thyaagaala Thallivi… Thayaagaala Gurthuvu
Bhoothalli Biddalu… Chigurinche Kommalu
Chidhimesina Puvvulu… Thyaagaala Gurthulu, Haa
Maa Bhoomulu Maakenani… Bhale Bhale Bhale Bhale Ha
Maa Bhoomulu Maakenani… Marlabadda Gaanamaa
Thiragabadda Raagama
Maralabadda Gaanamaa… Thiragabadda Raagamaa
Poru Telanganamaa… Kotlaadhi Praanamaa
Bhale Bhale Bhale Bhale Haa Ho Ha Ha
Podusthunna Poddumeedha… Nadusthunna Kaalamaa
Poru Telanganamaa..!
Poru Telanganamaa… Kotlaadhi Praanamaa
Amma Godavari..!
Nee Odduna Jeevinche Kotlaadhi Prajalaku Jeevanaadhaaram
Amma Krishnamma..!
KilaKila Navve Krishnamma, Amma Meeku Vandanam.
Godavari Alalameeda… Koti Kalala Gaanama
Krishnamma Parugulaku… Nurugula Haaramaa, Haa
Maa Neellu… Bhale Bhale Bhale Bhale Bhale Haa
Maa Neellu Maakenani… Katthula Kolaatama, Kanneeti Gaanama
Katthula Kolaatama… Kanneeti Gaanama
Poru Telanganamaa… Kotlaadhi Praanamaa
Bhale Bhale Bhale Bhale Haa Ho Ha Ha
Podusthunna Poddumeedha… Nadusthunna Kaalamaa
Poru Telanganamaa..!
Poru Telanganamaa… Kotlaadhi Praanamaa
Adhigo Aa Prakruthini Choodu… Ala Alumukuntundhi
Aa Kommalu Gaalitho Muddaaduthaayi
Aa Puvvulu Ala Aaduthaayi
Adhigo Pavuraala Janta… Neneppudu Vidiponantadhi
Vidipoyina Bandhamaa… Chedhiripoyina Snehama
Edabaasina Geethama… Yedhalaninda Gaayamaa, Haa
Puvvulu Puppodilaa… Bhale Bhale Bhale Bhale Bhale Haa
Puvvulu Puppodilaa… Pavithrabhandama,
Paramaathmuni Roopamaa
Pavithra Bandhamaa… Paramaathmuni Roopamaa
Poru Telanganamaa… Kotlaadhi Praanamaa
Bhale Bhale Bhale Bhale Haa Ho Ha Ha
Podusthunna Poddumeedha… Nadusthunna Kaalamaa
Poru Telanganamaa..!
Poru Telanganamaa… Kotlaadhi Praanamaa
Adhigo Raajulu, Dhoralu, Valasa Dhoralu
Bhoomini, Neellani, Praanulni… Sarvaswaanni Cherabattaaru
Raajula Khadgaala Kindha… Thegipoyina Shirassulu
Raajarikam Katthimeedha… Netthurla Gaayamaa
Dhoravaari Gadulallo… Bhale Bhale Bhale
Dhoravaari Gadulallo… Naligipoyina Nyaayamaa
Aandhravalasa Thootaalaku… Aaripoyina Deepama
Ha, Maa Paalana… Bhale Bhale Bhale Bhale Bhale, Haa
Maa Paalana Maakenani… Manduthunna Golamaa
Amaraveerula Swapnamaa… Manduthunna, Ho
Manduthunna Golamaa… Amaraveerula Swapnamaa
Amaraveerula Swapnamaa… Amaraveerula Swapnamaa
Amaraveerula Swapnama
పొడుస్తున్న పొద్దు మీద Lyrics
అతడు: పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా… పోరు తెలంగాణమా, హా
అదిగో ఆ కొండల నడుమ తొంగి చూచే ఎర్రని భగవంతుడెవడు? సూర్యుడు.
ఆ ఉదయించే సూర్యునితో పొడుస్తున్న పొద్దుతో పోటీపడి నడుస్తుంది కాలం. అలా కాలంతో నడిచిన వాడే కదిలిపోతాడు. ఓ పొడుస్తున్న పొద్దు
వందనం… వందనం.
అతడు: ఆ ఆ, పొడుస్తున్న…
భలే భలే భలే భలే హ హో హ, ఆహా
పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా
పోరు తెలంగాణమా…!
పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా
భలే భలే భలే భలే హ హో హ హ
అతడు: పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా
పోరు తెలంగాణమా…!
పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా
కోట్లాది ప్రాణమా
అతడు: ఓ భూతల్లి, సూర్యుడిని ముద్దాడిన భూతల్లి
అదిగో చిన్నారి బిడ్డల్ని జన్మనిచింది
అమ్మా..! నీవు త్యాగాల తల్లివి… త్యాగాల గుర్తువు
అతడు: భూతల్లి బిడ్డలు… చిగురించే కొమ్మలు
చిదిమేసిన పువ్వులు… త్యాగాల గుర్తులు, హా
మా భూములు మాకేనని…
భలే భలే భలే భలే భలే హ
మా భూములు మాకేనని మర్లబడ్డ గానమ… తిరగబడ్డ రాగమా
మర్లబడ్డ గానమ… తిరగబడ్డ రాగమా
అతడు: పోరు తెలంగాణమా… కోట్లాది ప్రాణమా
భలే భలే భలే భలే భలే హా హో హ హ
పొడుస్తున్న పొద్దు మీద… నడుస్తున్న కాలమా
పోరు తెలంగాణమా…!
పోరు తెలంగాణమా… కోట్లాది ప్రాణమా
అతడు: అమ్మా గోదావరి..!
నీ ఒడ్డున జీవించే కోట్లాది ప్రజలకు జీవనాధారం.
అమ్మా కృష్ణమ్మ..!
కిలకిల నవ్వే కృష్ణమ్మా, అమ్మ మీకు వందనం.
అతడు: గోదావరి అలలమీద కోటి కళల గానమ
కృష్ణమ్మా పరుగులకు నురుగులా హారమా, హా
మా నీళ్ళు… భలే భలే భలే భలే భలే హా
మా నీళ్ళు మాకేనని… కత్తుల కోలాటమ, కన్నీటి గానమా
కత్తుల కోలాటమా… కన్నీటి గానమా
అతడు: పోరు తెలంగాణమా… కోట్లాది ప్రాణమా
భలే భలే భలే భలే హ హో హ హ
పొడుస్తున్న పొద్దు మీద… నడుస్తున్న కాలమా
పోరు తెలంగాణమా…!
పోరు తెలంగాణమా… కోట్లాది ప్రాణమా
అతడు: అదిగో ఆ ప్రకృతిని చూడు
అలా అలుముకుంటుంది
ఆ కొమ్మలు గాలితో ముద్దాడుతాయి
ఆ పువ్వులు అలా ఆడుతాయి
అదిగో పావురాల జంట… నేనెప్పుడూ విడిపోనంటది
అతడు: విడిపోయిన బంధమా… చెదిరిపోయిన స్నేహమా
ఎడబాసిన గీతమా… యదల నిండ గాయమా, హా
పువ్వులు పుప్పడిలా… భలే భలే భలే భలే భలే, హా
పువ్వులు పుప్పడిలా… పవిత్ర బంధమా, పరమాత్ముని రూపమా
పవిత్ర బంధమా… పరమాత్ముని రూపమా
అతడు: పోరు తెలంగాణమా… కోట్లాది ప్రాణమా
భలే భలే భలే భలే హ హో హ హ
పొడుస్తున్న పొద్దు మీద… నడుస్తున్న కాలమా
పోరు తెలంగాణమా…!
పోరు తెలంగాణమా… కోట్లాది ప్రాణమా
అతడు: అదిగో రాజులు, దొరలు, వలస దొరలు
భూమిని, నీళ్ళని, ప్రాణుల్ని… సర్వస్వాన్ని చెరబట్టారు
రాజుల ఖడ్గాల కింద… తెగిపోయిన శిరస్సులు
అతడు: రాజరికం కత్తి మీద నెత్తుర్ల గాయమా..!
దొరవారి గడులల్లో…. భలే భలే భలే
దొరవారి గడులల్లో… నలిగిపోయిన న్యాయమా
ఆంద్ర వలస తూటాలకు… ఆరిపోయిన దీపమ
అతడు: హ, మా పాలన… భలే భలే భలే భలే భలే, హా
మా పాలన మాకేనని… మండుతున్న గోలమా
అమర వీరుల స్వప్నమా…మండుతున్న, హో
మండుతున్న గోలమా… అమరవీరుల స్వప్నమా
అమరవీరుల స్వప్నమా… అమరవీరుల స్వప్నమా.!
అమరవీరుల స్వప్నమా
Podusthunna Poddumeeda Lyrics: Jai Bolo Telangana
Comments are off this post