Oddanna Gundella Seri
Okkasaranna Raaye Singaari
Oopiraapeti Katthulni Noori
Pattinaavetta Nuvvonti Daari
Oddanna Gundella Seri
Okkasaranna Raaye Singaari
Oopiraapeti Katthulni Noori
Pattinaavetta Nuvvonti Daari
ఒద్దన్న గుండెల్ల సేరి Lyrics
అతడు: ఒద్దన్న గుండెల్ల సేరి
ఒక్కసారన్నా రాయే సింగారి
ఊపిరాపేటి కత్తుల్ని నూరి
పట్టినావెట్ట నువ్వొంటి దారి
అతడు: ఒద్దన్న గుండెల్ల సేరి
ఒక్కసారన్నా రాయే సింగారి
ఊపిరాపేటి కత్తుల్ని నూరి
పట్టినావెట్ట నువ్వొంటి దారి
అతడు: ఊడల మర్రి ఉయ్యాల ఆట
ఇయ్యాల ఏమాయెనో
కాడుకు పంపే కయ్యాల బాటల
దయ్యాలు తోడాయనో
అతడు: గడ్డి తిన్న నీ గుణము
గుడ్డిదాయె నా పాణము
మనసులున్న మనిషి తోడు లేకపోతే
సచ్చిపోవుడే న్యాయము
అతడు: గాయి గాయైతున్నదే
గంజాయి సెట్టు గుండెల్లోన నాటినట్టు
జ్ఞాపకాలు గావు వట్టెనే
ఇడిసి ఉందామంటే నీ మీద ఒట్టు
అతడు: వద్దన్న గుండెల్ల సేరి
ఒక్కసారన్నా రాయే సింగారి
ఊపిరాపేటి కత్తుల్ని నూరి
పట్టినావెట్ట నువ్వొంటి దారి
అతడు: గా పొలముగట్ల పొంట
పావురాల జంటలెక్క
రెక్క కప్పుకుంటి గదే
గుండె గూటి గంట
గావురాల పంట అంటు
కళ్ళ దాసుకుంటి గదే
అతడు: నీ మెత్తని పాదాలు
వత్తుక పోకుండా
ఎత్తుకొని నడిసినానులే
ఆ సిత్తురాల ప్రేమ
కత్తులే సెప్పులు లేకుండా
నిప్పుల్ల నడిపెనే
అతడు: గాయి గాయైతున్నదే
గంజాయి సెట్టు గుండెల్లోన నాటినట్టు
జ్ఞాపకాలు గావు వట్టెనే
ఇడిసి ఉందామంటే నీ మీద ఒట్టు
అతడు: వద్దన్న గుండెల్ల సేరి
ఒక్కసారన్నా రాయే సింగారి
సిన్ననాటి నుండి పెంచుకున్న
దండి ప్రేమ నుండి దూరమైననే
గుండెలోన నిండి ఎండవోలె మండి
వళ్లనంటు వెళ్ళిపోయినవే
అతడు: ఓ మనసు లేని మొండి
మోసే ప్రేమ బండి
గుండెకే గండి పెట్టేసినవే
నిన్ను పిలిసి గొంతు ఎండి
తలిసి మరిసే తిండి
అయినా తొండి చేసి గెలిసినవే
అతడు: గాయి గాయైతున్నదే
గంజాయి సెట్టు గుండెల్లోన నాటినట్టు
జ్ఞాపకాలు గావు వట్టెనే
ఇడిసి ఉందామంటే నీ మీద ఒట్టు
అతడు: ఊపిరల్లే అల్లి ఉప్పెనల్లె మళ్ళీ
ముంచుతుంటే కళ్ళే సెమ్మగిల్లే
ఒళ్ళునంత గిల్లి యదల మీద దొర్లి
ఎళ్ళిపోతే యదల ఈగె ముళ్ళే
అతడు: ఆ కాడు మందు జల్లి అడుగులన్ని జల్లి
బోడగయ్యి గోడులయ్యే ఇల్లేనా
నా కన్న కలలు కుళ్ళి
గోడు వాసన జల్లి
ఏడ్సి బీడులయ్యే నా ఈ కళ్ళే
అతడు: గాయి గాయైతున్నదే
గంజాయి సెట్టు గుండెల్లోన నాటినట్టు
జ్ఞాపకాలు గావు వట్టెనే
ఇడిసి ఉందామంటే నీ మీద ఒట్టు
అతడు: ఊహల్ల విషమల్లే ఊరి
గుండె మీద గడ్డపార గీరి
చేసుకుంటాన నవ్వుల్ని చోరీ
కట్టమాకమ్మ నా గుండె ఘోరీ
అతడు: ఒద్దన్న గుండెల్ల సేరి
ఒక్కసారన్నా రాయే సింగారి
ఊపిరాపేటి కత్తుల్ని నూరి
పట్టినావెట్ట నువ్వొంటి దారి
Comments are off this post