LYRIC
O Nirmala Bathukamma Lyrics: Unknown
O Nirmala Bathukamma Lyrics In English
Female: Banthi Poodhotalanni Bangaru Varnamai
Bathukamma Roopamai Merisene
Erra Kaluvaa Poolu Cheruvu Thalli
Nudhuti Meeda Sindhooramaddhinattu Virisene
Female: Ghallu Ghallunaa… Ghallu Ghallunaa
Gaajula Chappatlatho O Nirmala
O Nirmala Laalitha Aatalaadare, O Nirmala
Chorus: O Nirmala Laalitha Aatalaadare, O Nirmalaa
Pasupu Kommullaa… Pasupu Kommulla
Gouramma Roopamaayene O Nirmala
O Nirmala Laalitha Aadipaadare, O Nirmalaa
Chorus: O Nirmala Laalitha Aadipaadare, O Nirmalaa
O Nirmala Bathukamma Lyrics In Telugu
Female: బంతీ పూదోటలన్ని బంగారు వర్ణమై
బతుకమ్మ రూపమై మెరిసెనె
ఎర్రకలువా పూలు చెరువు తల్లి
నుదిటి మీద సింధూరమద్దినట్టు విరిసెనె
Female: ఘల్లు ఘల్లునా… ఘల్లు ఘల్లునా
గాజుల చప్పట్లతో ఓ నిర్మల
Chorus: ఓ నిర్మల లాలీత ఆటలాడరే, ఓ నిర్మల
ఓ నిర్మల లాలీత ఆటలాడరే, ఓ నిర్మలా
Female: పసుపు కొమ్ముల్లా పసుపు కొమ్ముల్ల
గౌరమ్మ రూపమాయెనే ఓ నిర్మల
ఓ నిర్మల లాలీత ఆడి పాడరే, ఓ నిర్మల
Chorus: ఓ నిర్మల లాలీత ఆడి పాడరే, ఓ నిర్మలా
Female: పట్టు చీరల్లా… అక్క చెల్లల్ల
మైదాకు చేతులతో ఓ నిర్మలా
ఓ నిర్మల లాలీత దరువెయ్యరే ఓ నిర్మల
Chorus: ఓ నిర్మల లాలీత దరువెయ్యరే ఓ నిర్మల
Female: చేమంతుల్ల పూబంతుల్ల బంగారు
బతుకమ్మలే ఓ నిర్మల
ఓ నిర్మల లాలీత బైలెల్లెనే ఓ నిర్మల
Chorus: ఓ నిర్మల లాలీత బైలెల్లెనే ఓ నిర్మల
Female: గంగ మురిసేనే… గంగ మురిసేనే
బతుకమ్మ పూలచీరతో ఓ నిర్మల
ఓ నిర్మల లాలీత పూల ఏరులే ఓ నిర్మల
Chorus: ఓ నిర్మల లాలీత పూల ఏరులే ఓ నిర్మలా
Chorus: హొ హొ హొ హొ… హొ హొ హొ హొ
హొయ్ హొయ్ హొయ్… హొయ్ హొయ్ హొయ్
Male: వచ్చింది వచ్చింది… పండుగ సందడి
పచ్చా పచ్చని పల్లెకూ… పసిడీ వన్నెల పల్లెకూ
తెచ్చింది తెచ్చింది తరగని వన్నెలు
మా పల్లె ముంగిల్లకూ…
Chorus: ముగ్గుల్ల వాకిల్లకూ
Male: తంగేడు గుమ్మడి గునుగు చామంతుల
పువ్వుల పల్లకి మా తల్లికీ
Chorus: మా చేతుల్లో నిండిన జాబిల్లికీ
Male: పసుపేమో పచ్చంగ… కుంకుమ ఎర్రంగ
తీరొక్క పూజలు మా తల్లికీ
Chorus: మా బతుకు వెలిగించేటి బతుకమ్మకీ
Male: వచ్చింది వచ్చింది… వచ్చింది వచ్చింది
వచ్చింది వచ్చింది… పండుగ సందడి
పచ్చా పచ్చని పల్లెకూ… పసిడీ వన్నెల పల్లెకూ
Female: గునుగూ పూలు గోయంగా
గునుగూ పూలు గోయంగా
గువ్వా లాలీ రాయే
గునుగూ పూలు గోయంగా
Chorus: గునుగూ పూలు గోయంగా
గునుగూ పూలు గోయంగా
గువ్వా లాలీ రాయే
గునుగూ పూలు గోయంగా
Female: బంతీ పూలు పేర్చంగ
బంతీ పూలు పేర్చంగ
బతుకమ్మ నవ్వెనే
బంతీ పూలు పేర్చంగ
Chorus: బంతీ పూలు పేర్చంగ
బంతీ పూలు పేర్చంగ
బతుకమ్మ నవ్వెనే
బంతీ పూలు పేర్చంగ
Female: తంగేడు పూలతోని… తంగేడు పూలతోని
తల్లీ గంగ జేరెనే… తంగేడు పూలతోని
Chorus: తంగేడు పూలతోని… తంగేడు పూలతోని
తల్లీ గంగ జేరెనే… తంగేడు పూలతోని
Chorus: యే లో యే లో… యే లో యేలో
హొయ్ హొయ్… హొయ్యారె హొయ్యారె
హొయ్యారె హొయ్యారె
Male: చుక్కలాలో ఓ చుక్కలాలో
చూసి మురవండే బతుకమ్మనీ
Chorus: చూసి మురవండే బతుకమ్మనీ
Male: నేరియాలో అల్లా నేరల్లో
కొలువ రారండే గౌరమ్మనీ
Chorus: కొలువ రారండే గౌరమ్మనీ
Male: అమ్మలాలో ఓయమ్మలాలో
పంచిపెట్టండే సద్దులనీ
ఆ ముగ్గురమ్మల ఏకం చెయ్యరె
గంగా గౌరీ బతుకమ్మనీ
గంగా గౌరీ బతుకమ్మనీ
Male: వచ్చింది వచ్చింది పండుగ సందడి
పచ్చా పచ్చని పల్లెకూ
పాడి పంటల సీమకూ
Chorus: వచ్చింది వచ్చింది పండుగ
సందడి పచ్చా పచ్చని పల్లెకూ
పసిడీ వన్నెల పల్లెకూ
పచ్చా పచ్చని పల్లెకూ
పాడి పంటల సీమకూ
Comments are off this post