LYRIC
Nalla Nagulamma Lyrics Part 1 by Thallapally Suresh Goud, Sung by Akunuri Devaiah & Lavanya, Music by Praveen Kaithoju, From Telangana Folk Song. ఓయ్, నాగులమ్మో, హొయ్, నల్లా నాగులమ్మ. నీ ఇంటికి ముందర బాయి అరె బాయి మీద గిలక.
Nalla Nagulamma Lyrics Part 1
నల్లా నాగులమ్మ part 1 Lyrics
అతడు: ఓయ్, నాగులమ్మో, హొయ్
నాగులమ్మో నాగులమ్మో నల్లా నాగులమ్మ
నాగులమ్మో నాగులమ్మో నల్లా నాగులమ్మ
నీ ఇంటికి ముందర బాయి
అరె బాయి మీద గిలక
ఇంటికి ముందర బాయి
అరె బాయి మీద గిలక
అతడు: గిర్కోలే గిర్కోలే గిర్కోలే తిరిగి రావమ్మో
నల్లా నాగులమ్మ
గిర్కోలే తిరిగి రావమ్మో
నల్లా నాగులమ్మ
ఆమె: నా ఇంటి పక్కన గల్లీ
నా ఇంటి సుట్టూ మంది
నా ఇంటి పక్కన గల్లీ
నా ఇంటి సుట్టూ మంది
ఆమె: నలుగుర్లో నలుగుర్లో నలుగుర్లో
నన్ను పిలువకురో.. అందాల బావయ్య
నవ్వులపాలు జెయ్యకురో… ముద్దుల బావయ్య
అతడు: నాగులమ్మో, హొయ్
నాగులమ్మో నాగులమ్మో నల్లా నాగులమ్మ
నాగులమ్మో నాగులమ్మో నల్లా నాగులమ్మ
అతడు: హె రంగు సీరా కట్టి
అరె నెత్తిన మల్లెలు వెట్టి
హె రంగు సీరా కట్టి
అరె నెత్తిన మల్లెలు వెట్టి
అరె యాడికి పిల్ల యాడికి
అరె యాడికి బయలుదేరినవే నల్లా నాగులమ్మ
నేను వట్టిగనే పడ్డానే నల్లా నాగులమ్మ
ఆమె: మన మీదే అందరి కళ్ళు
ఆ కన్నులు మీద మన్ను
మన మీదే అందరి కళ్ళు
ఆ కన్నులు మీద మన్ను
నీతోటి నీతోటి నీతోటి
ఎట్టా రావాలే అందాల బావయ్య
నా సుట్టూ అట్టా తిరుగకురా ముద్దుల బావయ్య
అతడు: నాగులమ్మో, హొయ్
నాగులమ్మో నాగులమ్మో నల్లా నాగులమ్మ
నాగులమ్మో నాగులమ్మో పిల్లా నాగులమ్మ
అతడు: మన ఊరి అవతల గట్టు
ఆ గట్టూ మధ్యన చెట్టు
మన ఊరి అవతల గట్టు
ఆ గట్టూ మధ్యన చెట్టు
గా చెట్టు గా చెట్టు
గా చెట్టు కిందికి రావమ్మో నల్లా నాగులమ్మ
నీ కోసం వెతికి సూత్తినో పిల్లా నాగులమ్మ
ఆమె: ఏ చెట్టు కిందికి రాను
మా గడప దాటి పోను
ఏ చెట్టు కిందికి రాను
మా గడప దాటి పోను
ఒంటరిగా ఒంటరిగా ఒంటరిగా
నన్ను వదిలెయ్ రో అందాల బావయ్య
వెతుకుకుంటా నువు తిరుగకురో
ముద్దుల బావయ్య
అతడు: నాగులమ్మో, పిల్లా
నాగులమ్మో నాగులమ్మో నల్లా నాగులమ్మ
నాగులమ్మో నాగులమ్మో పిల్లా నాగులమ్మ
అతడు: పిల్లా, అందమైన మాట
నా మాటల చెఱుకు తోట
అందమైన మాట
నా మాటల చెఱుకు తోట
తోటల్లో తోటల్లో తోటల్లో
కలుసుకుందామె నల్లా నాగులమ్మ
నా మీద ప్రేమ లేదాయె పిల్లా నాగులమ్మ
ఆమె: పెళ్లిగాని చేసుకుంటే నీ రాణి
నువ్ పెళ్లిగాని చేసుకుంటే నీ రాణి
పెళ్లైతే పెళ్లైతే పెళ్లైతే
నన్ను జేసుకో అందాల బావయ్య
నీతో ఏడికైనా వస్తారా ముద్దుల బావయ్య
నీతో ఏడికైనా వస్తారా అందాల బావయ్య
నీతో ఏడికైనా వస్తారా ముద్దుల బావయ్య
Comments are off this post