LYRIC

Nagamallelo Lyrics New Folk Song In Telugu & English Mamidi Mounika & Mallikteja, Music by Sv Mallikteja, From Telangana పాట. నాగమల్లేలో తీగమల్లేలో ఎన్ని అందాలో నా పల్లేలో…

Nagamallelo Lyrics New Folk Song

Male: Kodi Koosi Tellavaaripoyindho
Naagamallelo Teegamallelo
Enni Andhaalo Naa Pallelo
Female: Kondasaatu Nundi Poddhu Podusindhe
Nagamallelo Teegamallelo
Enni Andhaalo Naa Pallelo

నాగమల్లేలో తీగమల్లేలో Lyrics

అతడు:  కోడి కూసి తెల్లవారిపోయిందో
నాగమల్లేలో తీగమల్లేలో
ఎన్ని అందాలో నా పల్లేలో
ఆమె: కొండసాటు నుండి పొద్దు పొడుసిందో
నాగమల్లేలో తీగమల్లేలో
ఎన్ని అందాలో నా పల్లేలో

అతడు: కిలకిల పక్షులతో పల్లె కళకళలాడుతుందో
ఆమె: బలబల తెల్లారేనో పల్లె, బంగారు బొమ్మోలెనో
అతడు: గిరుల నుండి ఝరులు పారుతుంటే
తరులు కురులు ఇరబోసి ఆడుతుంటే

ఇద్దరు: పరవశమొందినాదో నేలంత
పాలు తాగుతున్నదో
ఊయలలూగుతుందో పల్లంత
ఊపిరి పీల్చుకుందో

అతడు: గరిక మీద మంచు కునుకులే తీయంగ
రామ సిలకల గుంపు రాగాలు తీయంగ
అలమందలు సేల గట్లల్ల మేయంగ
రైతన్న పనిలోకి రమ్మాని పిలువంగ
ఆమె: రైతన్న పనిలోకి రమ్మాని పిలువంగ

అతడు: నా పల్లె తల్లులు పొలము బాటల్లో
నాగమల్లేలో తీగమల్లేలో
ఆమె: తెల్ల జొన్నంబలి తాగి పోతుండ్రో
నాగమల్లేలో తీగమల్లేలో
ఎన్ని ముల్లేలో నా పల్లేలో

అతడు: కమ్మరి కిట్టయ్య కర్రు సాటేసిండు
వడ్లోల్ల లింగయ్య నాగలి చేసిండు
ముల్లుకర్ర దొత్తెలు సేత వట్టుకోని
సాగిపోతున్నారు సద్ది గట్టుకోని
ఆమె: సాగిపోతున్నారు సద్ది గట్టుకోని

అతడు: అలపాట దాపట పుల్లెడ్ల గట్టీ
నాగమల్లేలో తీగమల్లేలో
ఎన్ని వర్ణాలో నా పల్లేలో
ఆమె: అరక వట్టి పొలము దున్నుతున్నారో
నాగమల్లేలో తీగమల్లేలో
ఎన్ని వర్ణాలో నా పల్లేలో

అతడు: పరవశమొందినాదో నేలంత
పాలు తాగుతున్నదో
ఊయలలూగుతుందో పల్లంత
ఊపిరి పీల్చుకుందో

అతడు: నల్లని బురదల్లో సల్లాని సేతుల్తో
నాట్లు వేస్తున్నారు, నా పల్లె తల్లులు
పొట్టకొస్తే మేము పొంగిపోతామమ్మ
బాలింత నీవైతే బతుకంత వెలుగమ్మ
ఆమె: బాలింత నీవైతే బతుకంత వెలుగమ్మ

అతడు: నేలమ్మ నీ కడుపు సల్లంగుండాలో
నాగమల్లేలో తీగమల్లేలో
ఎన్ని గంధాలో నా పల్లేలో
ఆమె: నిత్యము మా బతుకు పచ్చంగుండాలో
నాగమల్లేలో తీగమల్లేలో

ఇద్దరు: ఎన్ని బంధాలో నా పల్లేలో
ఎన్ని గంధాలో నా పల్లేలో
ఎన్ని బంధాలో నా పల్లేలో

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO