LYRIC
Mallika Mallika Lyrics Shaakuntalam Movie
Singers: Ramya Behara
Music: Mani Sharma
Lyrics: Chaitanya Prasad
Mallika Mallika Lyrics In English
Female: Mallika Mallika
Malathi Maalika
Choodava Choodava Edi Naa Yelika
Mallika Mallika
Maalathi Maalika
Female: Choodava Choodava Edi Naa Yelika
Hamsika Hamsika
Jaagune Seyaka
Poyira Poyiraa
Rajutho Raa Ika
Female: Athaniko Kaanuka Eeyana Nenika
Valapuke Nedika Veduka Kaaga
Chorus: Aaha Neelaveni
Pooche Poola Aamani
Raaje Chentha Chera Rajyannelu Maa Rani
Munula Ghanula Mana Vana Seema
Maaruni Sharamu Parama
Madhura Sudhala Sumama
Manasu Nilupa Tharama
Female: Swapnika Chaitrika
Naa Priya Nethrika
Choodava Choodaca Yedi Naa Yelika
Female: Saguma Meghama… Saguma Meghama
Swamine Cheruma
Vaanane Veenalai Maa Kathe Paaduma
Nee Cheli Neccheli Chulu Dalchindhani
Sheegrame Rammani Margame Choopuma
Milamila Merisele Shaaradakashame
Velavela Vennelai… Vege Maa Preme
Chorus: Thaara Thoranalai
Theerche Ningi Daarule
Nele Paalaputhai Nimpe Prema Deepale
Marula Virula Rasajarilona
Manasu Thadise Laalana
Amala Kamala Nayana
Telise Hrudaya Thapana
Female: Aakulo Aakunai
Ashrama Vaasivai Aashaga Chudana
Athani Raakakai
Female: O Cheli Cheli… Endhuke Ee Chali
Bhuthalam Naa Madhi Sheethalam Ayinadi
Manchulo Munchina
Entha Vedinchina
Athani Amshane Vechhaga Daachani
Shishirame Aashala Aakule Raalchina
Chigurulu Veyaga Chaitrame Kaana
Chorus: Hemanthalu Ela
Seemanthalu Velalo
Chindhe Ela Baala
Vaasanthale Neelona
Nelalu Gadachinavi Nela Baala
Kadhali Kadali Alalaa
Amara Vimala Sumama
Suguna Manini Kanumaa
Female: Kannula Vechele Kaayale Kaachele
Aashaga Choodaga
Athani Raakakai
మల్లికా మల్లికా Lyrics In Telugu
ఆమె: మల్లికా మల్లికా
మాలతి మాలికా
చూడవా చూడవా ఏడి నా ఏలిక
మల్లికా మల్లికా
మాలతి మాలికా
ఆమె: చూడవా చూడవా ఏడి నా ఏలిక
హంసికా హంసికా
జాగునే సేయకా
పోయిరా పోయిరా
రాజుతో రా ఇక
ఆమె: అతనికో కానుక ఈయన నేనిక
వలపుకే నేడిక వేడుక కాగా
కోరస్: ఆహ నీలవేణి
పూచే పూల ఆమని
రాజే చెంత చేరా రాజ్యాన్నేలు మా రాణి
మునుల ఘనుల మన వన సీమ
మారుని శరము పరమా
మధుర సుధల సుమమా
మనసు నిలుపతరమా
ఆమె: స్వప్నికా చైత్రికా
నా ప్రియా నేత్రికా
చూడవా చూడవా ఏడి నా ఏలిక
ఆమె: సాగుమా మేఘమా… సాగుమా మేఘమా
స్వామినే చేరుమా
వాననే వీణాలై మా కథే పాడుమా
నీ చెలీ నెచ్చెలి చూలు దాల్చిందని
శీఘ్రమే రమ్మని మార్గమే చూపుమా
మిల మిల మెరిసెలే శారదాకాశమే
వెలవెలా వెన్నెలై… వేగె మా ప్రేమే
కోరస్: తార తోరణాలై
తీర్చే నింగి దారులే
నేలే పాలపుంతయి నింపే ప్రేమ దీపాలే
మారుల విరుల రసఝరి లోనా
మనసు తడిసె లలనా
అమల కమల్ నయాన
తెలిసే హృదయ తపనా
ఆమె: ఆకులో ఆకునై
ఆశ్రమ వాసివై ఆశగా చూడనా
అతని రాకకై…
ఆమె: ఓ చెలి చెలీ… ఎందుకె ఈ చలి
భూతలం నా మది శీతలం అయినది
మంచులో ముంచిన
ఎంత వేధించినా
అతని అంశనే వెచ్చగా దాచని
శిశిరమె ఆశలా ఆకులే రాల్చిన
చిగురులు వేయగా చైత్రమే కానా
కోరస్: హేమంతాలు ఎలా
సీమంతాల వేళలో
చిందే ఎలా బాల
వాసంతలే నీలోనా
నెలలు గడచినవి నెలబాల
కదలి కడలి అలలా
అమర విమల సుమమా
సుగుణ మణిని కనుమా
ఆమె: కన్నులే వేచేలే కాయలే కాచేలే
ఆశగా చూడగా… అతని రాకకై
Music Label: Tips Telugu
Comments are off this post