LYRIC

Korukunna Swase Lyrics by Rehman, Music by Karthik Rodriguez, Singers Sid Sriram, Manisha Maganti, From Ninnu Chere Tarunam Telugu Movie Song. కోరుకున్న శ్వాసే చేరుకుంది నీవై ఊరుకోని ఆశే జారుతుంది నీరై…

Korukunna Swase Lyrics

Korukunna Swase Lyrics

Male: Korukunna Swase
Cherukundi Neevai
Oorukoni Aashe
Jaaruthundhi Neerai

Male: Idhi O Sambaram
Idhi O Sambramam

Male: Korukunna Swaase
Cherukundi Neevai

Both: Kurulanu Thaaki O Kshanam
Nudutana Jaari O Kshanam
Kanulapai Vaali O Kshanam
Kshanamoka Madhura Mohanam

Both: Pedavini Meeti O Sukham
Terichnu Pusthakam
Chevulanu Cheri O Sukham
Aligenu Santhakam

Both: Hrudayamunanti O Sukham
Chadivenu Pranaya Ashtakam
Chutukanu Thatti O Sukham
Cheripenu Jathagaa Vyaapakam

Male: Mohaala Daahaalu Teereti Ee Vela
Mounaala Gaanaalu Mrogenule Priyaa
Female: Swargaala Daarullo Saageti Ee Leela
Santosha Teeraalu Cheraalilaa

Male: Kaalamatha Aagipoye Aata
Kallalona Kaanthulaina Poota

Female: Nuvvu Nenu Ekamaina Chota
Taaralanni Nela Vaalenanta
Male: Tagilina Chota Thakshanam
Taragani Teepi Lakshanam
Manasuna Poose Madhuvanam
Thanuvuna Vintha Parimalam

Female: Anuvulalona O Ranam
Vayasoka Indhanam
Virigina Viraha Bandhanam
Tholirasa Spandhanam

Male: Korukunna Swase
Cherukundi Neevai
Oorukoni Aashe
Jaaruthundhi Neerai

కోరుకున్న శ్వాసే చేరుకుంది నీవై Lyrics

అతడు: కోరుకున్న శ్వాసే
చేరుకుంది నీవై
ఊరుకోని ఆశే
జారుతుంది నీరై

అతడు: ఇది ఓ సంబరం
ఇది ఓ సంభ్రమం

అతడు: కోరుకున్న శ్వాసే
చేరుకుంది నీవై

ఇద్దరు: కురులను తాకి ఓ క్షణం
నుదుటన జారి ఓ క్షణం
కనులపై వాలి ఓ క్షణం
క్షణమొక మధుర మోహనం

ఇద్దరు పెదవిని మీటి ఓ సుఖం
తెరిచెను పుస్తకం
చెవులను చేరి ఓ సుఖం
అలిగెను సంతకం

ఇద్దరు హృదయమునంటి ఓ సుఖం
చదివెను ప్రణయ అష్టకం
చుటుకను తట్టి ఓ సుఖం
చెరిపెను జతగా వ్యాపకం

అతడు: మొహాల దాహాలు తీరేటి ఈవేళ
మౌనాల గానాలు మ్రోగెనులే ప్రియా
ఆమె: స్వర్గాల దారుల్లో సాగేటి ఈ లీల
సంతోష తీరాలు చేరాలిలా

అతడు: కాలమంత ఆగిపోయే ఆట
కళ్ళలోన కాంతులైన పూట

ఆమె: నువ్వు నేను ఏకమైన చోటా
తారలన్ని నేల వాలేనంటా
అతడు: తగిలినచోట తక్షణం
తరగని తీపి లక్షణం
మనసున పూసే మధువనం
తనువున వింత పరిమళం

ఆమె: అణువులలోన ఓ రణం
వయసొక ఇంధనం
విరిగిన విరహ బంధనం
తొలిరస స్పందనం

అతడు:  కోరుకున్న శ్వాసే
చేరుకుంది నీవై
ఊరుకోని ఆశే
జారుతుంది నీరై

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO