LYRIC

Kastapadda Palammina Mass Lyrics and Music & Sung by Bhole Shavali, From Love Failure Telugu Song కష్టపడ్డా పాలమ్మిన మాస్ సాంగ్. కష్టపడ్డా ఇస్తాపడ్డా.

Kastapadda Palammina Mass Lyrics

కష్టపడ్డా ఇస్తాపడ్డా Lyrics

నీ మీద మన్నుపోత్తే, నీ మీద దుమ్ముపోత్తే, నిన్నెత్తుకపోతే, నీ ఏట్ల పెట్ట, నీ తాడు దెంప, నీ తలపండ్లు పలగ, నీ దింపుడుగల్లం గాను బుజ్జే, ఓ బుజ్జీ..!

అతడు: ఏయ్, ఏడుపాపి ఏం జరిగిందో చెప్పు..!
(జుమ్ జుమ్)

అతడు: కష్టపడ్డ, ఇష్టపడ్డ, లవ్ ల బడ్డ
అది కాదంటే కాళ్ళమీద బడ్డ
అది సరే అంటే సంబరపడ్డ
దానన్నలతోటి తన్నులపడ్డ

అతడు: కిందపడ్డ, మీద పడ్డ
కర్మగాలి జైళ్ల పడ్డ
వాన్ని వీన్ని బతిలాడి
ఆఖరికి బైటపడ్డ

(ఏ, కొంచెం బీట్ల ఏడువు..!)
(జుమ్ జుమ్ జుమ్)
అతడు: మోసం చేత్తివి కదరా బుజ్జో, ఓ బుజ్జీ
ఏం పాపం చేసిన్నే బుజ్జో, ఓ నా బుజ్జి

అతడు: ఊకో ఊకో… సిగ్గు లేదు
ఏడ్తవా మొగోనివై
ఊకో ఊకో, జుమ్

అతడు: అవవవవవవ బుజ్జో
అవ్వ అవ్వ అవవవవవ బుజ్జా
లాకరు బోకరు గాన్ని తెచ్చి
లచ్చల కట్నం ఇత్తరె బుజ్జో, ఓ బుజ్జీ
అచ్చంగా లవ్ జేత్తే బిచ్చపోడంటరే బుజ్జే
(ఊకో)

అతడు: పిత్త బలిసినోళ్లకే పిలిశి పిల్లనిత్తరే బుజ్జో, ఓ బుజ్జీ
ప్రాణంగా ప్రేమిత్తే ప్రాణమే తీత్తరా బుజ్జే

(అయితే ఏవంటవ్)
అతడు: ఆడు కట్నకానుకలు తీసుకునే వేస్ట్ గాడైతే
నేను ఎదురుపెట్టబోతులు పెట్టి పెళ్ళి చేసుకొనే
గట్సున్న మోతగాన్ని బుజ్జో, రా బుజ్జీ…

(ఏయ్ సరేగాని అమ్మాయి కోసం
ఏం కొన్నవో చెప్పో, జుమ్)

అతడు: పాలమ్మిన, దానికి పట్టుశీరె కొన్న
(ముప్పై వేలు)
పూలమ్మిన, దానికి పుస్తెల్ తాడు కొన్న
(యాభై వేలు)
బోర్ వెల్ నడిపిన, ఇంట్లె బాసన్లు కొన్న
(డెబ్భై ఐదు)
బర్లను పెంచిన, దానికి బంగారం కొన్న
(లచ్చ)

అతడు: ఒళ్ళు వంచి ఇల్లు కొన్న
సెమట కార్చి కారు కొన్న
బెడ్డుమీద పరుపు కొన్న
పదిమందిల పరువుగున్న

అతడు: ఇజ్జత్ తీత్తివి కదనే బుజ్జో, ఓ బుజ్జీ
ఏం పాపం చేసిన్నె బుజ్జో, ఓ నా బుజ్జి

అతడు: వదినె వీడు జైళ్ళుండే కదా
బైటికొచ్చిండు కదు, తెల్వదా
ఒరెక్కొ… మరి పొల్లెంజేత్తంది
ఆ, అటుంటంది… ఇటుంటంది
మనకెందుకులే వదిన, ఊకో

అతడు: ఊకో ఊకో ఊకో… సిగ్గు లేదు
ఏడిపిత్తరా మొగోన్ని..!

అతడు: అవవవవవవ బుజ్జో
అవ్వ అవ్వ అవవవవవ బుజ్జా

అతడు: నా కళ్ళ నీళ్లు జూసి
నీ కంటికి నిద్రెట్ల పట్టె బుజ్జో, ఓ బుజ్జీ
మన జ్ఞాపకాలు మర్శి నీకు
బువ్వెట్టా వంటబట్టె బుజ్జీ

అతడు: ఊరంతా పొక్కినంక
ఊరిచ్చుడెందుకింక బుజ్జో, ఓ బుజ్జీ
మనుసులు కలిసీనంక
డొంకతిరుగుడెందుకె ఇంకా బుజ్జో

(మరిఇప్పుడేమంటవ్..!)
అతడు: దొంగలు పడ్డ ఆర్నెల్లకు కుక్కలు మొరిగినట్టు
మనం ఎప్పుడో పెట్టుకున్న కనెక్షనుకు మీ అన్నల
రియాక్షనేందో నీ ఓవరా క్షనేందో
అర్ధం కావట్లేదు బుజ్జో, ఓ బుజ్జీ

(ఓయ్, ఇప్పుడేమంటవ్ మరి..! జుమ్)
అతడు: లొల్లిజేత్తె… పబ్లికైత
పెళ్లి జేత్తే… ధావతైత
హాయిగుంటే… హనీమూనైత
మీ అండ ఉంటె… దండం పెడతా

అతడు: లైకు కొడితే ఐకానైత
షేరు జేస్తే ప్యారుగుంట
సబ్ స్క్రైబ్ జేస్తే సక్సెసైత
(జుమ్ జుమ్ జుమ్)

అతడు: భోలే ఆఫీసియల్ ఛానల్
పెట్టుకున్నమె బుజ్జో, ఓ బుజ్జీ
భోంబాటుగా చూసుకుంటనే
బుజ్జో, ఓ నా బుజ్జీ

ఇన్నరు కదా..! భోలే ఆఫీసియల్ ఛానల్ సబ్ స్క్రైబ్ చేసి
లైక్ గొట్టి, షేర్ జేస్తే, మా బుజ్జిని సల్లగ జూసుకుంట.

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO