LYRIC

Kapolla Intikada Lyrics by Srilatha Yadav, Music by Madeen Sk, Sung by Srilatha Yadav, From Telangana Folk Song. కాపోల్ల ఇంటికాడ కామూడాటలట. పడుసోళ్లంత వచ్చి ఆడుకుంటరట.

Kapolla Intikada Lyrics

కాపోల్ల ఇంటికాడ కామూడాటలట Lyrics

ఆమె: కాపోల్ల ఇంటికాడ కామూడాటలట
పడుసోళ్లంత వచ్చి ఆడుకుంటరట
ఆడబోదమా బావ సూడబోదమా
మనం ఆడబోదమా బావ సూడబోదమా

ఆమె: కాపోల్ల ఇంటికాడా, అరె కామూడాటలటా
ఆ, పడుసోళ్లంత వచ్చి ఆడుకుంటరట
ఆడబోదమా బావ సూడబోదమా
మనం ఆడబోదమా బావ సూడబోదమా

ఆమె: జాలూ తండలోన తీజు పండుగట
జనాలంత గూడి జాతర జేస్తరట
కూడిబోదమా బావ సూడబోదమా
మనం కూడిబోదమా బావ సూడబోదమా

ఆమె: జాలూ తండలోనా, అరె తీజు పండుగట
ఆ, జనాలంత గూడి జాతర జేస్తరట
కూడిబోదమా బావ సూడబోదమా
మనం కూడిబోదమా బావ సూడబోదమా

ఆమె: శాలోళ్ల ఇంటికాడ సక్కాని సీరాలట
సీరకూదగ్గ రైకపోతాలు పోస్తరట
పొయ్యి వస్తవా బావ గొని తెస్తవా
నువ్వు పొయ్యి వస్తవా నాకు గొని తెస్తవా

ఆమె: శాలోళ్ల ఇంటికాడా, అరె సక్కాని సీరాలటా
ఆ, సీరకూదగ్గ రైకపోతాలు పోస్తరట
పొయ్యి వస్తవా పోతల్ల రైక తెస్తవా నాకు
పొయ్యి వస్తవా పోతల్ల రైక తెస్తవా

ఆమె: బెస్తోళ్లింటీకాడ ఒట్టీ శాపాలట
ఒట్టి సేపల కూర గట్టీగుంటదట
వండిపెడతరా నీకు తినపెడతరా
బావ వండిపెడతరా నీకు తినపెడతరా

ఆమె: బెస్తోళ్లింటీకాడా, అరె ఒట్టీ శాపాలటా
ఆ, ఒట్టి సేపల కూర గట్టీగుంటదట
వండిపెడతరా నీకు తినపెడతరా
నేను వండిపెడతరా నీకు తినపెడతరా

ఆమె: పెసరు బండ మీద ప్రేమా జంటలట
ప్రేమాగల్ల మాట సెప్పుకుంటరట
గూడిబోదమా బావ సూడబోదమా
మనం కూడిబోదమా బావ సూడబోదమా

ఆమె: పెసరు బండ మీదా, అరె ప్రేమా జంటలటా
ఆ, ప్రేమాగల్ల మాట సెప్పుకుంటరట
గూడిబోదమా బావ సూడబోదమా
మనం కూడిబోదమా బావ సూడబోదమా

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO