LYRIC

Edo Priyaragam Lyrics by Sirivennela Seetharama Sastry, Music by Devi Sri Prasad, Sung by Sagar & Sumangali, From Aarya Telugu Movie Song. ఏదో ప్రియరాగం వింటున్నా. చిరునవ్వుల్లో
ప్రేమా ఆ సందడి నీదేనా.

Edo Priyaragam Lyrics

Male: Edho Oka Raagam Vintunnaa
Chirunavvullo
Premaa Aa Sandhadi Needhenaa
Edho Navanaatyam Choosthunnaa
Sirimuvvallo
Premaa Aa Savvadi Needhenaa

Male: Ittaage Kalakaalam
Choodaalanukuntunnaa
Itupaina Ee Swapnam
Kariginchaku Emainaa
Premaa Oo Premaa
Chirakaalam Naavente

Male: Nuvvunte Nijamegaa Swapnam
Nuvvunte Prathi Maata Sathyam
Nuvvunte Manasanthaa
Edho Theeyani Sangeetham
Nuvvunte Prathi Adugu Andham
Nuvvunte Prathi Kshanamu Swargam
Nuvvunte Ika Jeevithamanthaa
Edho Santhosham

Male: Oo… Paata Paadadhaa Mounam
Purivippi Aadadhaa Praanam
Adavinaina Poodhota Cheyyadhaa
Prema Baatalo Payanam
Dhaari Chupadhaa Shoonyam
Arachetha Vaaladhaa Swargam
Elladhaati Paravallu Thokkadhaa
Velluvaina Aanandham

Male: Premaa Nee Saavaasam
Naa Shwaasaku Sangeetham
Premaa Nee Saannithyam
Naa Oohala Saamraajyam
Premaa Oo Premaa
Gundello Kalakaalam

Male: Nuvvunte Prathi Aasha Sontham
Nuvvunte Chirugaale Gandham
Nuvvunte Endainaa Kaadhaa
Challani Saayanthram
Nuvvunte Prathimaata Vedham
Nuvvunte Prathi Paluku Raagam
Nuvvunte Chirunavvulathone
Nindenu Ee Lokam

Male: Oo… Unnachota Unnaanaa
Aakaashamandhukunnaanaa
Cheliyaloni Ee Kottha Sambaram
Naaku Rekka Thodigenaa
Munigi Theluthunnaanaa
Ee Muchhataina Muripaana
Aameloni Aanandhasaagaram
Nannu Munchu Samayaana

Male: Hariville Nannalle
Ee Rangulu Neevalle
Sirimallela Vaagalle
Ee Vennela Neevalle
Premaa Oo Premaa
Idhi Shaashwathamanukonaa

Male: Nuvvunte Dhigulantu Raadhe
Nuvvunte Velugantu Podhe
Nuvvunte Mari Maatalu
Kooda Paataipothaaye
Nuvvunte Edhurantu Ledhe
Nuvvunte Alupantu Raadhe
Nuvvunte Ye Kashtaalainaa
Entho Ishtaale

ఏదో ప్రియరాగం వింటున్నా Lyrics

అతడు: ఏదో ప్రియరాగం వింటున్నా
చిరునవ్వుల్లో
ప్రేమా ఆ సందడి నీదేనా
ఏదో నవనాట్యం చూస్తున్నా
సిరిమువ్వల్లో
ప్రేమా ఆ సవ్వడి నీదేనా

అతడు: ఇట్టాగే కలకాలం చూడాలనుకుంటున్నా
ఇటుపైన ఈ స్వప్నం
కరిగించకు ఏమైనా
ప్రేమా ఓ ప్రేమా
చిరకాలం నావెంటే

అతడు: నువ్వుంటే నిజమేగా స్వప్నం
నువ్వుంటే ప్రతి మాట సత్యం
నువ్వుంటే మనసంతా
ఏదో తీయని సంగీతం
నువ్వుంటే ప్రతి అడుగు అందం
నువ్వుంటే ప్రతి క్షణము స్వర్గం
నువ్వుంటే ఇక జీవితమంతా
ఏదో సంతోషం

అతడు: ఓ… పాట పాడదా మౌనం
పురివిప్పి ఆడదా ప్రాణం
అడవినైన పూదోట చెయ్యదా
ప్రేమ బాటలో పయనం
దారి చూపదా శూన్యం
అరచేత వాలదా స్వర్గం
ఎల్లదాటి పరవళ్ళు తొక్కదా
వెల్లువైన ఆనందం

అతడు: ప్రేమా నీ సావాసం
నా శ్వాసకు సంగీతం
ప్రేమా నీ సాన్నిత్యం
నా ఊహల సామ్రాజ్యం
ప్రేమా ఓ ప్రేమా
గుండెల్లో కలకాలం

అతడు: నువ్వుంటే ప్రతి ఆశ సొంతం
నువ్వుంటే చిరుగాలే గంధం
నువ్వుంటే ఎండైనా కాదా
చల్లని సాయంత్రం
నువ్వుంటే ప్రతిమాట వేదం
నువ్వుంటే ప్రతి పలుకు రాగం
నువ్వుంటే చిరునవ్వులతోనే
నిండెను ఈ లోకం

అతడు: ఓ… ఉన్నచోట ఉన్నానా
ఆకాశమందుకున్నానా
చెలియలోని ఈ కొత్త సంబరం
నాకు రెక్క తొడిగేనా
మునిగి తేలుతున్నానా
ఈ ముచ్చటైన మురిపాన
ఆమెలోని ఆనందసాగరం
నన్ను ముంచు సమయాన

అతడు: హరివిల్లే నన్నల్లే
ఈ రంగులు నీవల్లే
సిరిమల్లెల వాగల్లే
ఈ వెన్నెల నీవల్లే
ప్రేమా ఓ ప్రేమా
ఇది శాశ్వతమనుకోనా

అతడు: నువ్వుంటే దిగులంటూ రాదే
నువ్వుంటే వెలుగంటూ పోదే
నువ్వుంటే మరి మాటలు
కూడ పాటైపోతాయే
నువ్వుంటే ఎదురంటూ లేదే
నువ్వుంటే అలుపంటూ రాదే
నువ్వుంటే ఏ కష్టాలైనా
ఎంతో ఇష్టాలే

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT