LYRIC

Chinni Ma Bathukamma Lyrics by Kandikonda, and Sung by Telu Vijaya, and Kandukuri Shankar Babu, Music by Suresh Bobbili, పచ్చ పచ్చని పల్లె పచ్చాని పల్లె. మబ్బుల్లో లేసింది వాకిళ్ళు ఊడ్చి. from చిన్నీ మా బతుకమ్మ… చిన్నారక్క బతుకమ్మ Song.

Chinni Ma Bathukamma Lyrics In English

Chorus: Chinni Ma Bathukamma Chinnarakka Bathukamma
Dadhi Ma Bathukamma Damera Moggala Bathukamma
Thangedu Puvvulu Thala Tala Merise
Vaada Vaadanthaa O Puvvula Vanamaaye
Prathi Oori Cherivemo O Puvvula Thotaaye

Chorus: Goonugu Puvvulu Mila Mila Merise
Vaada Vaadantha O Puvvula Vanamaaye
Prathi Oori Cherivemo O Puvvula Thotaaye

Female: Pachha Pachhani Palle Pachhaani Palle
Mabbullo Lechindhi Vaakillu Oodchi
Muggulu Vettindhi
Andaala Boddemma Vaakitlo Vetti
Cheyyetthi Mokkindhi
Kaapaadamantu Gourammanadigindhi

Male: Hey, Aadabiddalu Intinta Ninde
Amma Nanna Gundentha Ponge
Satthu Pindi Sakinaalu Choosthe
Notinindaa Oorillu Oore
Poddhu Poddhunne Thammullu Lechi
Poolakosam Bailelli Urike
Chaapa Parichi Vaakillalona
Chellelantha Bathukamma Perche

Female: Pachha Pachhani Palle Pachhaani Palle
Mabbullo Lechindhi Vaakillu Oodchi
Muggulu Vettindhi
Andaala Boddemma Vaakitlo Vetti
Cheyyetthi Mokkindhi
Kaapaadamantu Gourammanadigindhi

Female: Aggo Chinthalu Poose Sinthalu Gaase
O Laali Gummadi O Lali Muddhula Gummadi
Chorus: O Laali Muddhula Gummadi
Female: Bhale, Chinuku Kurisi Pudami Murise
O Laali Gummadi… O Lali Muddhula Gummadi
Chorus: O Lali Muddhula Gummadi

Female: Matti Vaasana Manasuna Thaake
Panta Polamu Pachhaga Navve
Pakshi Egiri Parugu Teese
Pashuvulanni Sindhulu Vese
Male: Hey, Ningi Nela Ooru Vaada
Paravashinche Panduga Jaripe

Female: Pachha Pachhani Palle Pachhaani Palle
Mabbullo Lechindhi Vaakillu Oodchi
Muggulu Vettindhi
Andaala Boddemma Vaakitlo Vetti
Cheyyetthi Mokkindhi
Kaapaadamantu Gourammanadigindhi

Chorus: Hey, Bathukamma Netthiketthi
Prathi Vaada Vaada Kadhuluthunte
Chooda Rendu Kallu Chaalavasale Poola Nadhule
Oori Cheruvu Katta Kaada
Mana Akka Chellellantha Cheri
Aadipaaduthunte Madhu Murise Kallu Thadise

Male: Hey, Paatha Inupa Sandhugalo
Unna Kottha Battale Ontipaiki Vachhesi
Chorus: Gully Gullu Oorege, Aaa Aa Aa Aa

Chinni Ma Bathukamma Lyrics In Telugu

కోరస్:  చిన్నీ మా బతుకమ్మ… చిన్నారక్క బతుకమ్మ
దాదీ మా బతుకమ్మ… దామెర మొగ్గల బతుకమ్మ
తంగెడు పువ్వులు తళతళ మెరిసే
వాడ వాడంతా ఓ పువ్వుల వనమాయే
ప్రతి ఊరి చేరివేమో… ఓ పువ్వుల తోటాయే

కోరస్: గూనుగు పువ్వులు మిలమిల మెరిసే
వాడ వాడంతా ఓ పువ్వుల వనమాయే
ప్రతి ఊరి చేరివేమో… ఓ పువ్వుల తోటాయే, ఆ ఆఆ ఆ

ఆమె: పచ్చ పచ్చని పల్లె పచ్చాని పల్లె
మబ్బుల్లో లేసింది వాకిళ్ళు ఊడ్చి
ముగ్గులు వెట్టింది
అందాల బొడ్డెమ్మ వాకిట్లో వెట్టి
చెయ్యెత్తి మొక్కింది
కాపాడమంటూ గౌరమ్మనడిగింది

అతడు: హే, ఆడబిడ్డలు ఇంటింట నిండే
అమ్మ నాన్న గుండెంత పొంగే
సత్తు పిండి సకినాలు చూస్తే
నోటినిండా ఊరిళ్లు ఊరే
పొద్దు పొద్దున్నే తమ్ముళ్లు లేచి
పూలకోసం బైలెల్లి ఉరికే
చాప పరిచీ వాకిళ్లలోనా
చెల్లెల్లంతా బతుకమ్మ పేర్చే

ఆమె: పచ్చ పచ్చని పల్లె… పచ్చాని పల్లె
మబ్బుల్లో లేసింది వాకిళ్ళు ఊడ్చి
ముగ్గులు వెట్టింది
అందాల బొడ్డెమ్మ… వాకిట్లో వెట్టి
చెయ్యెత్తి మొక్కింది
కాపాడమంటూ గౌరమ్మనడిగింది

కోరస్: ఏలా ఏలా, ఏలెలా ఏలా ఏలా
ఏలెలే ఏలే ఏలా, ఏలెలా ఏలేలా ఏలా
ఏలా ఏలా, ఏలెలా ఏలా ఏలా
ఏలెలే ఏలే ఏలా… ఏలెలా ఏలేలా ఏలా

ఆమె: అగ్గో చింతలు పూసే సింతలు గాసే
ఓ లాలి గుమ్మడి… ఓ లాలీ ముద్దుల గుమ్మడి
కోరస్: ఓ లాలీ ముద్దుల గుమ్మడి
ఆమె: భలే, చినుకూ కురిసి… పుడమి మురిసే
ఓ లాలి గుమ్మడి… ఓ లాలీ ముద్దుల గుమ్మడి
కోరస్: ఓ లాలీ ముద్దుల గుమ్మడి

ఆమె: మట్టి వాసన మనసును తాకే
పంటా పొలము పచ్చగ నవ్వే
పక్షీ ఎగిరి పరుగూ తీసే
పశువులన్నీ సింధులు వేసే
హే, నింగీ నేల ఊరు వాడ
పరవశించి పండుగ జరిపే

ఆమె: పచ్చ పచ్చని పల్లె… పచ్చాని పల్లె
మబ్బుల్లో లేసింది వాకిళ్ళు ఊడ్చి
ముగ్గులు వెట్టింది
అందాల బొడ్డెమ్మ… వాకిట్లో వెట్టి
చెయ్యెత్తి మొక్కింది
కాపాడమంటూ గౌరమ్మనడిగింది

కోరస్: హే బతుకమ్మ నెత్తికెత్తి
ప్రతి వాడ వాడ కదులుతుంటే
చూడ రెండు కళ్ళు చాలవసలే పూల నదులే
ఊరి చెరువు కట్ట కాడ
మన అక్క చెల్లెళ్లంత చేరి
ఆడిపాడుతుంటె మది మురిసే, కళ్ళు తడిసే

కోరస్: హే, పాత ఇనుప సందుగలో
ఉన్న కొత్త బట్టలే… ఒంటి పైకి వచ్చేసి
గల్లీ గల్లీ ఊరేగే… హా ఆ ఆఆ ఆ ఆ ఆ

ఆమె: హే,పున్నామా పున్నామా… నిండు పున్నామా
సిరిమాల్లేలో మా రాగిమాల్లేలో
కోరస్: సిరిమాల్లేలో మా రాగిమాల్లేలో
ఆమె: ఇగా, రంగు రంగు పూలుదెచ్చి రాసుల్లు పోసే
సిరిమాల్లేలో మా బొండుమాల్లేలో
కోరస్: సిరిమాల్లేలో మా బొండుమాల్లేలో

ఆమె: అగో, తీరొక్క పూలతోటి… అందంగా వేర్చే
సిరిమాల్లేలో మా రాగిమాల్లేలో
కోరస్: సిరిమాల్లేలో మా రాగిమాల్లేలో
ఆమె: మనకు బతుకునిచ్చు బతుకమ్మను
భక్తితోటి గొలిసే
సిరిమాల్లేలో మా బొండుమాల్లేలో
కోరస్: సిరిమాల్లేలో మా బొండుమాల్లేలో

అతడు: హే, పూలన్నీ పులకించే… మట్టి మనషులాట
పుడమినంత ఆడించె… చమట చుక్క పాట
రాలే కన్నీరు నవ్విందీ పూటే
అక్కా అందుకుంది… ఉయ్యాల పాటే
కష్టం చేసే చెయ్యి కాముడాటలాడే
బడికీ పోయె చెల్లి… బతుకమ్మనెత్తె
పడి లేచే పాపలు… పండు ముసలి తాతలు
చేసే సంబురాలు ఈ రోజే

ఆమె: మా భూమాత గారాల… అందాల తనయీ
నాగమాల్లేలో మా తీగమాల్లేలో
కోరస్: సిరిమాల్లేలో మా రాగిమాల్లేలో
 సిరిమాల్లేలో మా బొండుమాల్లేలో
ఆమె: మమ్ము కరుణించి… కాపాడు బతుకమ్మ తల్లి
నాగమాల్లేలో మా తీగమాల్లేలో

కోరస్: సిరిమాల్లేలో మా రాగిమాల్లేలో
 సిరిమాల్లేలో మా బొండుమాల్లేలో
సిరిమాల్లేలో మా బొండుమాల్లేలో
 సిరిమాల్లేలో మా బొండుమాల్లేలో

పచ్చ పచ్చని పల్లె Song Info

Lyrics Kandikonda
Singers Telu Vijaya, Kandukuri Shankar Babu
Music Suresh Bobbili
Song Lable

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO