LYRIC

Chandrullo Unde Kundelu Lyrics by Sirivennela Seetharama Sastry, Music by Devi Sri Prasad, Sung by Shankar Mahadevan, DSP, From నువ్వొస్తానంటే నేనొద్దంటానా Movie Song. చంద్రుళ్ళో ఉండే కుందేలు కిందికొచ్చిందా.

Chandrullo Unde Kundelu Lyrics

Male: Chandrullo Unde Kundelu Kindikochhindaa
Kindikochhi Neelaa Maarindaa
Chorus: Thandaane Thandaane
Chukkallo Unde Jigelu… Ninnu Mechhindhaa
Ninnu Mechhi Neelo Cherindaa
Chorus: Thandhaane Thandhaane

Male: Nuvvalaa Saage Thovanthaa
Naavalaa Thooge Neeventa, (Evantaa)
Nuvvelle Dhaare Maarindhaa
Neevalle Theere Maari… Erai Prindhemo Nelantha
Aa Oo Oo Oo Ooo

Male: Chandrullo Unde Kundelu Kindikochhindaa
Kindikochhi Neelaa Maarindaa

Male: Guvvalaa Dhoosukuvachhaave
Tholi Yavvanamaa
Telusaa Ekkada Vaalaalo
Navvule Theesuku Vachhaave
Eedu Sambaramaa
Telusaa Evvarikivvaalo, Oo
Female: Hey, Gagagaa Riga Risaasa Saaninisa
Gagagaa Riga Risasaa Oo Oo

Male: Koochupudi Anna Padham
Kottha Aata Nerpindhaa
Paapalaanti Letha Padham Pathashalagaa
Koonalamma Jaanapadam
Palle Daati Vachhindhaa
Jaavaleela Jaanathanam Baata Choopagaa

Male: Aa Aa, Kunchelo Daage Chitraalu Edhurochhelaa
Anthataa Enno Varnaalu
Manchulo Daage Chaithraalu Badhulichhelaa
Inthalaa Evo Raagaalu

Male: Aakathaayi Sandhadigaa… Aagaleni Thondharaga
Saaguthunna Ee Payanam Entha Varako
Repu Vaipu Mundhadugaa… Leniponi Dhundhudukaa
Reguthunna Ee Vegam Endhukorako, Ho Ho

Male: Mattiki Mabbuki Ee Vela Dhooramenthante
Lekkale Maayam Ayipovaa
Rentinee Okkati Cheselaa Theeramedhante
Dhikkule Thatthra Padipovaa

చంద్రుళ్ళో ఉండే కుందేలు Lyrics

అతడు: చంద్రుళ్ళో ఉండే కుందేలు కిందికొచ్చిందా
కిందికొచ్చి నీలా మారిందా
కోరస్: తందానే తందానే
చుక్కల్లో ఉండే జిగేలు… నిన్ను మెచ్చిందా
నిన్ను మెచ్చి నీలో చేరిందా…
కోరస్: తందానే తందానే

అతడు: నువ్వలా సాగే తోవంతా
నావలా తూగే నీవెంటా, ఏవంటా
నువ్వెళ్ళే దారే మారిందా
నీవల్లే తీరే మారి.. ఏరై పారిందేమో నేలంతా
ఆ ఓఓ ఓ ఓఓ ఓ

అతడు: చంద్రుళ్ళో ఉండే కుందేలు కిందికొచ్చిందా
కిందికొచ్చి నీలా మారిందా
హే స హు స హే స హు స హే స హు స
ఏలే లేలే ఏలో… ఏలే లేలో ఏలో
ఏలే లేలో ఏలో ఏలో ఏలే ఏలేలో
హూ హే హే హే… హూ హే హే హే

అతడు: హాయ్, మై నేమ్ ఈజ్ సంతోష్
మే ఐ నో యువర్ నేమ్ ప్లీజ్ – స్టెల్లా
స్టెల్లా..! ఓ వాటే బ్యూటిఫుల్ నేమ్
కెన్ ఐ హేవ్ యువర్ ఫోన్ నంబర్
రేయ్ రేయ్ రేయ్..!
హో హో, కమింగ్ డాడ్

అతడు: గువ్వలా దూసుకువచ్చావే
తొలి యవ్వనమా
తెలుసా ఎక్కడ వాలాలో
నవ్వులే తీసుకు వచ్చావే
ఈడు సంబరమా
తెలుసా ఎవ్వరికివ్వాలో, ఓ

ఆమె: హే, గగగా రిగ రిసాస సానినిస
గగగా రిగ రిససా ఓ ఓ
హొయ్యారే హొయ్యా హొయ్యారే హొయ్యా

అతడు: కూచిపూడి అన్న పదం
కొత్త ఆట నేర్చిందా
పాపలాంటి లేత పదం… పాఠశాలగా
కూనలమ్మ జానపదం
పల్లె దాటి వచ్చిందా
జావళీల జాణతనం… బాటచూపగా

అతడు: ఆ ఆ, కుంచెలో దాగే చిత్రాలు ఎదురొచ్చేలా
అంతటా ఎన్నో వర్ణాలు
మంచులో దాగే చైత్రాలు బదులిచ్చేలా
ఇంతలా ఏవో రాగాలు

అతడు: ఆకతాయి సందడిగా… ఆగలేని తొందరగా
సాగుతున్న ఈ పయనం ఎంత వరకో
రేపు వైపు ముందడుగా… లేని పోని దుందుడుకా
రేగుతున్న ఈ వేగం ఎందుకొరకో, హో హో

అతడు: మట్టికి మబ్బుకి ఈ వేళ దూరమెంతంటే
లెక్కలే మాయం అయిపోవా
రెంటినీ ఒక్కటి చేసేలా తీరమేదంటే
దిక్కులే తత్తర పడిపోవా

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO