LYRIC
Bangaru Bangaru Lyrics by Hanumanth Yadav, From Love Failure Folk Song. ఏడుకొండలెక్కిన ఎంకన్నస్వామిని జూస్తనేమో నేను ఎన్ని కొండలెక్కినా. నీజాడ దొరకదు నాకెందుకో. బంగారు… బంగారు.
Bangaru Bangaru Lyrics
బంగారు బంగారు Lyrics
అతడు: ఏడుకొండలెక్కినా
ఎంకన్నస్వామిని జూస్తనేమో
నేను ఎన్ని కొండలెక్కినా
నీజాడ దొరకదు నాకెందుకో
అతడు: ఏడుకొండలెక్కినా
ఎంకన్నస్వామిని జూస్తనేమో
నేను ఎన్ని కొండలెక్కినా
నీజాడ దొరకదు నాకెందుకో
సెప్పవే సిన్నదానా నీకు సేదయ్యానా
పలకవే మొండిదానా మారిపోతివింతలోనా
నిన్ను వెతికే బాటసారిని పయనమై వస్తున్నా
అంటరానివాడినిజేసి
ఏడదాగి ఉన్నవమ్మా
నువ్వెన్ని సార్లు అడిగినా
నే పిలవలేని పేరునే
నీరాకకై మల్లీ నే పిలిచేస్తున్నా మల్లిరావే
అతడు: బంగారు బంగారు అంటూ
నిన్ను పిలవాలనుందే
నా ప్రాణం నువ్వే అంటూ
నే అరిసిసెప్పాలనుందే
నువ్వు నవ్వుతూ ఉండాలంటే
నేనేంసెయ్యాలో సెప్పవే
నా ప్రాణం అడిగి సూడే
సంతోషంగా ఇచ్చేసుకుంటానే
అతడు: దయలేని దేవుడె వాడు
ఎట్టరాత రాసినాడు జూడు
అర్దంకాని ప్రేమ జూపి
ఇప్పుడు అర్దమేచేసినాడు
అతడు: నా తప్పేమైతే లేదు
ఒక్కసారి నన్ను నమ్మిచూడు
నిన్ను గుండెల్లొ వెట్టి చూసుకుంటనే
నమ్మవె మా అమ్మతోడు
ఎన్నాళ్ళే నీకు నాకు మద్య ఈదూరం
ఉండాలే నువ్వునేనిలా కలకాలం
కోరుకున్నానే నేను నీలో ఆనందం తిరిగిరాలేవే
అతడు: మనసు ఎదురుచూసె నీకోసం
నువ్వెన్ని సార్లు అడిగినా
నే పిలవలేని పేరునే
నీరాకకై మల్లీ నే
పిలిచేస్తున్నా మల్లిరావే
అతడు: బంగారు బంగారు అంటూ
నిన్ను పిలవాలనుందే
నా ప్రాణం నువ్వే అంటూ
నే అరిసిసెప్పాలనుందే
నువ్వు నవ్వుతూ ఉండాలంటే
నేనేంసెయ్యాలో సెప్పవే
నా ప్రాణం అడిగి సూడే
సంతోషంగా ఇచ్చేసుకుంటానే
అతడు: మనసులున్న నిన్ను జూడు
ఎంత పిచ్చిగ ప్రేమించినానో
నన్ను పిచ్చివాణ్ణి చేసి నువ్విలా
ఏడిపిస్తున్నావు ఎందుకు
ఎంతదలుసుకుంటున్నా నిన్ను
ఇంత పొలమారలేదమ్మ నీకు
ఒక్కసారి కళ్ళముందుకొచ్చి పోతె
నీ సొమ్మేంపోతదె సెప్పు
నిన్నేలే నే కట్టుకుందా మనుకున్నా
నీ నవ్వునే నే మనసార కోరుకుంటున్నా
నువు కావాలే నాకు ఏజన్మలోనయినా
ఉంటానని ఓ మాటే నాకివ్వమ్మా
నువ్వెన్ని సార్లు అడిగినా
నే పిలవలేని పేరునే
నీరాకకై మల్లీ నే
పిలిచేస్తున్నా మల్లిరావే
అతడు: బంగారు బంగారు అంటూ
నిన్ను పిలవాలనుందే నా ప్రాణం
నువ్వే అంటూ నే అరిసిసెప్పాలనుందే
నువ్వు నవ్వుతూ ఉండాలంటే
నేనేంసెయ్యాలో సెప్పవే
నా ప్రాణం అడిగి సూడే
సంతోషంగా ఇచ్చేసుకుంటానే…
Comments are off this post