LYRIC
Avunanavaa Lyrics by ఓరి దేవుడా Movie
Singer: Sid Sriram
Lyrics: Ramajogayya Sastry
Music: Leon James
Avunanavaa Lyrics In English
Avunanavaa Lyrics In Telugu
అతడు: ఏమని అనాలని తోచని క్షణాలివి
ఏ మలుపో ఎదురయ్యే పయనమిదా
ఆమని నువ్వేనని నీ జత చేరాలని
ఏ తలపో మొదలయ్యే మౌనమిదా
అతడు: ఏవో గురుతులు నన్నడిగే ప్రశ్నలకి
నువ్వేబదులని రాగలనా నీ దరికీ
విడిగా తడిగా విరబూసే కలకీ
చెలియా నీ కాంతినందించవా
అతడు: అవుననవా అవుననవా
అవుననవా మనసును సంభాళించవా
అవుననవా అవుననవా
అవుననవా మరల ప్రేమగ సమీపించవా
అతడు: తెలిసే లోపే నువు తెలిసే లోపే
చెలీ చేజారిందే ప్రపంచం
కలిసేలోపే మనం కలిసేలోపే
ఇలా ఎడబాటై రగిలినదే కాలం
కన్నెదుటే వజ్రాన్నీ కనుగొంటూ ఉన్నా
వెతికానే ఓ తీరాలనీ
నిజమేదో తెలిసాకా ఇపుడంటూ ఉన్నా
ఎన్నటికీ నువు కావాలనీ
అతడు: అవుననవా అవుననవా
అవుననవా మనసును సంభాళించవా
అవుననవా అవుననవా
అవుననవా మరల ప్రేమగ సమీపించవా
అతడు: అవుననవా అవుననవా అవుననవా
అవుననవా అవుననవా
అవుననవా మనసును సంభాళించవా
అవుననవా అవుననవా
అవుననవా మరల ప్రేమగ సమీపించవా
అవుననవా అవుననవా Song
Song Label: Saregama Telugu
Comments are off this post