Amma padu Jolapata
Amrtanikanna Tiyyananta
Amma padu Lalipata
Teneluri Pare Erulanta
Nindu Jabili Cupinci
Gotito Bugganu Gillesi
Uggunu Paṭṭi Uyalalupe
Amma Lalana
Upiripose Nureḷla
Nindu Divena
అమ్మపాడే జోల పాట అమృతాన్ని కన్న తియ్యనంట Lyrics
ఆమె: అమ్మపాడే జోలపాట
అమృతానికన్నా తియ్యనంట
అమ్మపాడే లాలిపాట
తేనెలూరి పారే ఏరులంట
ఆమె: నిండు జాబిలి చూపించి
రెండు బుగ్గలు గిల్లేసి
నిండు జాబిలి చూపించి
గోటితో బుగ్గను గిల్లేసి
ఆమె: ఉగ్గును పట్టి ఊయలలూపే అమ్మ లాలన
ఊపిరిపోసే నూరేళ్ల నిండు దీవెన
అమ్మపాడే జోలపాట
అమృతానికన్నా తియ్యనంట
ఆమె: కురిసే వాన చినుకులకి
నీలినింగి అమ్మ
మొలిచే పచ్చని పైరులకి
నేలతల్లి అమ్మ ||2||
వీచే చల్లని గాలులకి
పూలకోమ్మ అమ్మ
ప్రకృతిపాడే పాటలకి
యలకోయిల అమ్మ
ఆమె: సృష్టికి మూలం అమ్మతనం
సృష్టికి మూలం అమ్మతనం
సృష్టించలేనిది అమ్మ గుణం
ఆమె: అమ్మపాడే జోలపాట
అమృతానికన్నా తియ్యనంట
అమ్మపాడే లాలిపాట
తేనెలూరి పారే ఏరులంట
ఆమె: నింగిని తాకే మేడలకి
పునాది రాయి అమ్మ
అందంపొందిన ప్రతి శిలకి
ఉలిగాయం అమ్మ ||2||
చీకటి చెరిపే వెన్నెలకి
జాబిల్లి అమ్మ
లోకం చూపే కన్నులకి
కంటిపాప అమ్మ
ఆమె: అమ్మంటే అనురాగ జీవనీ
అమ్మంటే అనురాగ జీవని
అమ్మ ప్రేమే సంజీవని
ఆమె: అమ్మపాడే జోలపాట
అమృతానికన్నా తియ్యనంట
మమ్మ… అమ్మపాడే లాలిపాట
తేనెలూరి పారే ఏరులంట
ఆమె: నిండు జాబిలి చూపించి
రెండు బుగ్గలు గిల్లేసి
నిండు జాబిలి చూపించి
గోటితో బుగ్గను గిల్లేసి
ఉగ్గును పట్టి ఊయలలూపే అమ్మ లాలన
ఊపిరిపోసే నూరేళ్ల నిండు దీవెన
ఆమె: అమ్మపాడే జోలపాట
అమృతానికన్నా తియ్యనంట
మా అమ్మపాడే లాలిపాట
తేనెలూరి పారే ఏరులంట
Comments are off this post