LYRIC

Akkada Unnadu Ayyappa Lyrics

Singer: Dappu Srinu

Lyrics: Dappu Srinu

Akkada Unnadu Ayyappa Lyrics In English

Male: Akkada Unnadu Ayyappa Ikkada Unnadu Ayyappa
Chorus: Akkada Unnaadayyappa Ikkada Unnaadayyappa
Male: Ekkada Unnaa Manakosam Ikkadakosthadayyappa
Chorus: Ekkada Unnaa Manakosam Ikkadakosthadayyappa
Male: Ekkada Unnaa Manakosam Ikkadakosthadayyappa

Akkada Unnadu Ayyappa Lyrics In Telugu

ఆతడు: అక్కడ ఉన్నాడయ్యప్పా ఇక్కడ ఉన్నాడయ్యప్పా
కోరస్: అక్కడ ఉన్నాడయ్యప్పా ఇక్కడ ఉన్నాడయ్యప్పా
ఆతడు: ఎక్కడ ఉన్నా మనకోసం ఇక్కడకొస్తాడయ్యప్పా
కోరస్: ఎక్కడ ఉన్నా మనకోసం ఇక్కడకొస్తాడయ్యప్పా
ఆతడు: ఎక్కడ ఉన్నా మనకోసం ఇక్కడకొస్తాడయ్యప్పా

ఆతడు: శబరిమల కొండనుండి… బయలుదేరడయ్యప్పా
కోరస్: బయలుదేరడయ్యప్ప… బయలుదేరడయ్యప్పా
ఆతడు: పావన పంపానది… చేరినాడు అయ్యప్పా
కోరస్: చేరినాడు అయ్యప్ప చేరినాడు అయ్యప్పా

ఆతడు: పంపా గణపతిని పలకరించడయ్యప్ప
కోరస్: పంపా గణపతిని పలకరించడయ్యప్ప
ఆతడు: పెద్దన్నకు వందనాలు… చేసినాడు అయ్యప్ప
కోరస్: పెద్దన్నకు వందనాలు చేసినాడు అయ్యప్ప
జై గణేశా జై గణేశా… అన్నాడు అయ్యప్పా

కోరస్: అక్కడ ఉన్నాడయ్యప్పా… ఇక్కడ ఉన్నాడయ్యప్పా
ఎక్కడ ఉన్నా మనకోసం… ఇక్కడకొస్తాడయ్యప్పా || 2 ||

ఆతడు: పంపానదిలో స్నానమాడి బయలుదేరడయ్యప్పా
కోరస్: బయలుదేరడయ్యప్ప… బయలుదేరడయ్యప్ప
ఆతడు: పళనిమలై కొండ పైకి… చేరినాడు అయ్యప్పా
కోరస్: చేరినాడు అయ్యప్ప… చేరినాడు అయ్యప్ప

ఆతడు: సుబ్రహ్మణ్య స్వామిని పలకరించాడయ్యప్పా
కోరస్: సుబ్రహ్మణ్య స్వామిని… పలకరించాడయ్యప్పా
ఆతడు: చిన్నన్నకి వందనాలు… చేసినాడు అయ్యప్ప
కోరస్: చిన్నన్నకి వందనాలు… చేసినాడు అయ్యప్ప
ఆతడు: వెల్మురుగ వెల్మురుగ అన్నడు అయ్యప్ప

కోరస్: అక్కడ ఉన్నాడయ్యప్పా… ఇక్కడ ఉన్నాడయ్యప్పా
ఎక్కడ ఉన్నా మనకోసం… ఇక్కడకొస్తాడయ్యప్పా || 2 ||

ఆతడు: పళనిమలై కొండ నుండి బయలుదేరాడయ్యప్పా
కోరస్: బయలుదేరాడయ్యప్ప… బయలుదేరాడయ్యప్పా
ఆతడు: తిరుమల కొండ పైకి చేరినాడు అయ్యప్ప
కోరస్: చేరినాడు అయ్యప్ప… చేరినాడు అయ్యప్ప

ఆతడు: ఏడుకొండల ఎంకయ్యని పలకరించాడయ్యప్ప
కోరస్: ఏడుకొండలెంకయ్యని పలకరించాడయ్యప్ప
ఆతడు: కన్న తల్లికి వందనాలు చేసినాడు అయ్యప్ప
కోరస్: కన్నతల్లికి వందనాలు… చేసినాడు అయ్యప్ప
ఆతడు: గోవింద నామస్మరణ చేసినాడు అయ్యప్ప

కోరస్: అక్కడ ఉన్నాడయ్యప్పా… ఇక్కడ ఉన్నాడయ్యప్పా
ఎక్కడ ఉన్నా మనకోసం… ఇక్కడకొస్తాడయ్యప్ప || 2 ||

ఆతడు: తిరుమలకొండ నుండి బయలుదేరాడయ్యప్ప
కోరస్: బయలుదేరాడయ్యప్ప… బయలుదేరాడయ్యప్ప
ఆతడు: శ్రీశైలం కొండ పైకి… చేరినాడు అయ్యప్ప
కోరస్: చేరినాడు అయ్యప్ప… చేరినాడు అయ్యప్ప

ఆతడు: శ్రీశైలం మల్లయ్యని పలకరించాడయ్యప్ప
కోరస్: శ్రీశైలం మల్లయ్యని పలకరించాడయ్యప్ప
ఆతడు: కన్నతండ్రికి వందనాలు… చేసినాడు అయ్యప్ప
కోరస్: కన్నతండ్రికి వందనాలు… చేసినాడు అయ్యప్ప
ఆతడు: ఓం శివాయ నమః శివాయ అన్నాడు అయ్యప్ప

కోరస్: అక్కడ ఉన్నాడయ్యప్పా… ఇక్కడ ఉన్నాడయ్యప్పా
ఎక్కడ ఉన్నా మనకోసం… ఇక్కడకొస్తాడయ్యప్ప || 2 ||

ఆతడు: శ్రీశైలం కొండ నుండి బయలుదేరాడయ్యప్ప
కోరస్: బయలుదేరాడయ్యప్ప… బయలుదేరాడయ్యప్ప
ఆతడు: విజయవాడ కొండ పైకి… చేరినాడు అయ్యప్ప
కోరస్: చేరినాడు అయ్యప్ప… చేరినాడు అయ్యప్ప

ఆతడు: బెజవాడ దుర్గమ్మను పలకరించాడయ్యప్ప
కోరస్: బెజవాడ దుర్గమ్మను పలకరించాడయ్యప్ప
ఆతడు: ఆదిశక్తికి వందనాలు చేసినాడు అయ్యప్ప
కోరస్: ఆదిశక్తికి వందనాలు చేసినాడు అయ్యప్ప
జై భవానీ జై భవానీ అన్నాడు అయ్యప్ప

కోరస్: అక్కడ ఉన్నాడయ్యప్పా ఇక్కడ ఉన్నాడయ్యప్పా
ఎక్కడ ఉన్నా మనకోసం… ఇక్కడకొస్తాడయ్యప్ప
ఎక్కడ ఉన్నా మనకోసం ఇక్కడకొస్తాడయ్యప్ప
ఆతడు: ఇగ అక్కన్నుండి నేరుగా అయ్యప్ప ఎక్కడికెల్లిండు స్వామి

ఆతడు: పూజా భజన జరుగుచోటుకు వచ్చినాడు అయ్యప్ప
కోరస్: వచ్చినాడు అయ్యప్ప… వచ్చినాడు అయ్యప్ప
ఆతడు: అభిషేకం అర్చనలు స్వీకరించాడయ్యప్ప
కోరస్: స్వీకరించాడయ్యప్ప… స్వీకరించాడయ్యప్ప

ఆతడు: డప్పు శీను భజనలన్నీ… విన్నాడు అయ్యప్ప
కోరస్: డప్పు శీను భజనలన్నీ… విన్నాడు అయ్యప్ప
ఆతడు: స్వాములతో పేట తుళ్లి… ఆడినాడు అయ్యప్ప
కోరస్: స్వాములతో పేట తుళ్లి… ఆడినాడు అయ్యప్ప

ఆతడు: విల్లాలి వీరనే వీర మణికంఠనే
వీరాధి వీరులంట ముగ్గురన్నదమ్ములంట
కోరస్: స్వామి దింతకథోమ్ థోమ్
అయ్యప్ప దింతకథోమ్ థోమ్
అయ్యప్ప దింతకథోమ్ థోమ్
స్వామి దింతకథోమ్ థోమ్

ఆతడు: స్వాములతో పేట తుళ్లి… ఆడినాడు అయ్యప్ప
కోరస్: స్వాములతో పేట తుళ్లి… ఆడినాడు అయ్యప్ప
ఆతడు: అందరికి ఆశీస్సులు…
మనకి అందరికి ఆశీస్సులు ఇచ్చినాడు అయ్యప్ప

కోరస్: అక్కడ ఉన్నాడయ్యప్పా… ఇక్కడ ఉన్నాడయ్యప్పా
ఎక్కడ ఉన్నా మనకోసం ఇక్కడకొస్తాడయ్యప్ప || 3 ||

అక్కడ ఉన్నాడయ్యప్పా Song Info

Song Telugu Devotional
Album Dappu Srinu Ayyappa Bhajanalu
Lyrics & Composer Dappu Srinu
Song Credit & Source

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO