LYRIC
Yisukalo Putte Gouramma Lyrics From తెలంగాణ బతుకమ్మ పండుగ పాట. ఇసుకల పుట్టె గౌరమ్మ ఇసుకలో పెరిగే గౌరమ్మ ఇసుకలో వసంతమాడంగా పోయిరా గౌరమ్మ తీగె తిరుపతి మావిళ్లు పొన్నగంటితళ్లు
Yisukalo Putte Gouramma Lyrics
ఇసుకల పుట్టె గౌరమ్మ. ఇసుకలో పెరిగే గౌరమ్మ Lyrics
ఆమె: ఇసుకల పుట్టె గౌరమ్మ
ఇసుకలో పెరిగే గౌరమ్మ
ఇసుకలో వసంతమాడంగా పోయిరా గౌరమ్మ
తీగె తిరుపతి మావిళ్లు పొన్నగంటితళ్లు
పోగలవంటి వనములు
వనముల చిలుకలు గలగల పలికితె
వనమంతా కదిలె గౌరి మేడంతా కదిలె
ఆమె: పసుపులో పుట్టె గౌరమ్మ
పసుపులో పెరిగే గౌరమ్మ
పసుపులో వసంతమాడంగా
పోయిరా గౌరమ్మ
తీగె తిరుపతి మావిళ్లు పొన్నగంటితళ్లు
పోగలవంటి వనములు
వనముల చిలుకలు గలగల పలికితె
వనమంతా కదిలె గౌరి మేడంతా కదిలె
ఆమె: కుంకుమలో పుట్టె గౌరమ్మ
కుంకుమలో పెరిగే గౌరమ్మ
కుంకుమలో వసంతమాడంగా
పోయిరా గౌరమ్మ
తీగె తిరుపతి మావిళ్లు పొన్నగంటితళ్లు
పోగలవంటి వనములు
వనముల చిలుకలు గలగల పలికితె
వనమంతా కదిలె గౌరి మేడంతా కదిలె
ఆమె: గంధంలో పుట్టె గౌరమ్మ
గంధంలో పెరిగే గౌరమ్మ
గంధంలో వసంతమాడంగా
పోయిరా గౌరమ్మ
తీగె తిరుపతి మావిళ్లు పొన్నగంటితళ్లు
పోగలవంటి వనములు
వనముల చిలుకలు గలగల పలికితె
వనమంతా కదిలె గౌరి మేడంతా కదిలె.
Comments are off this post