LYRIC
Jillelamma Jitta Part 2 Lyrics by Monukota Prasad, Music by Kalyan Keys, Sung by Srinidhi, From Naaga Durga, Telangana Folk Song. Telugu In English పాట. జిల్లేలమ్మ జిట్ట వాని నవ్వు పుట్ల పంట జిల్లేలమ్మ జిట్ట వాని సూపు సాలునంటా.
Jillelamma Jitta Part 2 Lyrics
Female: Naa Ooriki Okka Andhagaadu
Pandagalaanti Pollagaadu
Nanne Geluvaga Vachhinadu
Gundenu Pokkili Jesinadu
Female: Atta Ittaa Saigalatho
Aagam Jesthadu Pollagaadu
Katta Meeda Vothante
Seyyini Vatti Laaginadu
Female: Chempa Meeda Gurthokati
Guttuga Vetti Poyinaade
Female: Jillelamma Jitta
Vaani Navvu Putla Panta
Oo, Jillelamma Jitta
Vaani Soopu Saalunanta
Female: Jillelamma Jitta
Vaani Navvu Putla Panta
Jillelamma Jitta
Vaani Soopu Saalunanta
జిల్లేలమ్మ జిట్ట వాని నవ్వు పుట్ల పంట Lyrics
ఆమె: నా ఊరికి ఒక్క అందగాడు
పండగలాంటి పొల్లగాడు
నన్నే గెలువగ వచ్చినడు
గుండెను పొక్కిలి జేసినడు
ఆమె: అట్టా ఇట్టా సైగలతో
ఆగంజేస్తడు పొల్లగాడు
కట్టా మీద వోతాంటే
సెయ్యిని వట్టి లాగినడు
చెంపా మీద గుర్తొకటి
గుట్టుగ వెట్టి పోయినాడే
ఆమె: జిల్లేలమ్మ జిట్ట
వాని నవ్వు పుట్ల పంట
ఓ, జిల్లేలమ్మ జిట్ట
వాని సూపు సాలునంట
జిల్లేలమ్మ జిట్ట
వాని నవ్వు పుట్ల పంట
జిల్లేలమ్మ జిట్ట
వాని సూపు సాలునంటా
ఆమె: ఆ, వాలుతున్న పొద్దులాగా
ముద్దూగుంటడు సిన్నవాడు
పొద్దూ తిరుగుడు పువ్వులాగా
సుట్టూ తిరుగుతుంటడాడు
ఇక్కడ దాగుండి సూస్తాడో
నన్నే కాపాడుకుంటాడు
ఎప్పుడు ఎనకాలే తిరుగుతడే
మనసుకు నచ్చిన పొల్లగాడు
ఆమె: ఏదో ఒక్కటి జేస్తాడే
ఎన్నెల పువ్వుల నవ్వులోడు
ఆమె: జిల్లేలమ్మ జిట్ట
వాని మాట సెలిమె ఊట
ఓ, జిల్లేలమ్మ జిట్ట
వాడు ఉంటె పండుగంట
జిల్లేలమ్మ జిట్ట
వాని మాట సెలిమె ఊట
ఓ, జిల్లేలమ్మ జిట్ట
వాడు ఉంటె పండుగంట
ఆమె: అరె బజార్లున్న పోరగాళ్ళ
సూపులు అన్ని ఆని మీద
బాజాప్తనే జెప్పుతాన
నాకే సొంతం ఆడుల్లా
ఆమె: నన్ను ఏందే ఏవే అనుకుంట
ఎంటనె ఉంటే సాలు కదా
నేను ఏవయ్యో ఏందయ్యో
అంటూ పిలుసుకుంట గదా
ఎట్టాగైనా ఏలుకుంటా
నేనే వాన్ని సాదుకుంటా
ఆమె: జిల్లేలమ్మ జిట్ట
వాని నవ్వు పుట్ల పంట
ఓ, జిల్లేలమ్మ జిట్ట
వాని సూపు సాలునంట
ఆమె: నా కంటీ మీద కునుకు లేక
ఎదురూ జూస్తు కూసున్న
నువ్వు ఎప్పుడు వస్తే అప్పుడే రా
లగ్గం కాయం జేసుకుంటా
ఆమె: సేతుల సెయ్యేసి జెప్పినావు
తిరిగొస్త పిల్లా నేను అని
బోర్డరు నౌకరి పోయినావు
భద్రంగా నువ్వుంటే సాలు నాకు
ఆమె: బావా పత్రిక కొట్టిచ్చినా
పండుగకు నువ్వు వత్తావుగా
ఆమె: జిల్లేలమ్మ జిట్ట
బావ నవ్వు పుట్ల పంట
ఓ, జిల్లేలమ్మ జిట్ట
బావ సూపు సాలునంట ||2||
Comments are off this post