LYRIC
Nindu Amasa Nadu Lyrics and Singer From Gaddar Gari Telangana Folk Song. In Telugu & English (నిండు అమాసనాడు ఓ లచ్చ గుమ్మడి… ఆడబిడ్డ పుట్టినాదో ఓ లచ్చ గుమ్మడి)
Nindu Amasa Nadu Lyrics
Male: Nindu Amasa Nadu O Lacha Gummadi
Aadabidda Puttinaadho O Lachha Gummadi
Chorus: Nindu Amasa Nadu O Lacha Gummadi
Aadabidda Puttinaadho O Lachha Gummadi
Male: Attha Thongi Soodaledhu O Lacha Gummadi
Mogadu Muddaadaraale O Lachha Gummadi
Male: Settha Gampalesukoni O Lachagummadi
Settha Kundileyyabothe O Lacha Gummadi
Kukkapilla Addamochhi… O Lacha Gummaadi
Akka Atla Seyakandho… O Lacha Gummadi
Male: Nindu Amasa Nadu O Lacha Gummadi
Aadabidda Puttinaadho O Lachha Gummadi
Chorus: Nindu Amasa Nadu O Lacha Gummadi
Aadabidda Puttinaadho O Lachha Gummadi
నిండు అమాసనాడు ఓ లచ్చ గుమ్మడి Lyrics
అతడు: నిండు అమాసనాడు ఓ లచ్చ గుమ్మడి
ఆడబిడ్డ పుట్టినాదో ఓ లచ్చ గుమ్మడి
అత్త తొంగి సూడలేదు ఓ లచ్చ గుమ్మాడి
మొగడు ముద్దాడరాలే ఓ లచ్చ గుమ్మాడి
కోరస్: నిండు అమాసనాడు ఓ లచ్చ గుమ్మడి
ఆడబిడ్డ పుట్టినాదో ఓ లచ్చ గుమ్మడి
అతడు: సెత్తగంపలేసుకోని… ఓ లచ్చ గుమ్మాడి
సెత్తకుండిలెయ్యబోతే… ఓ లచ్చ గుమ్మాడి
కుక్కపిల్ల అడ్డమొచ్చి… ఓ లచ్చ గుమ్మాడి
అక్క అట్ల సేయకందో… ఓ లచ్చ గుమ్మాడి
కోరస్: నిండు అమాసనాడు ఓ లచ్చ గుమ్మడి
ఆడబిడ్డ పుట్టినాదో ఓ లచ్చ గుమ్మడి
అతడు: బట్టలల్ల సుట్టుకోని… ఓ లచ్చ గుమ్మాడి
బాయిలో పడెయ్యబోతే… ఓ లచ్చ గుమ్మాడి
గంగమ్మ కొంగు సాపి… ఓ లచ్చ గుమ్మాడి
సెల్లె దానమియ్యుమందో… ఓ లచ్చ గుమ్మాడి
అతడు: పున్నమి దినముగోలే… ఓ లచ్చ గుమ్మాడి
పుత్తకాడా పడవేస్తే… ఓ లచ్చ గుమ్మాడి
నాగన్న పడిగె విప్పి… ఓ లచ్చ గుమ్మాడి
గొడుగూ పట్టిండమ్మో… ఓ లచ్చ గుమ్మాడి
కోరస్: నిండు అమాసనాడు ఓ లచ్చ గుమ్మడి
ఆడబిడ్డ పుట్టినాదో ఓ లచ్చ గుమ్మడి
అతడు: వరిగింజ నోట్లేసి… ఓ లచ్చ గుమ్మాడి
గొంతు పిసికి సంపబోతే… ఓ లచ్చ గుమ్మాడి
పెదువులేమో అడ్డమొచ్చి… ఓ లచ్చ గుమ్మాడి
పులుకు పులుకు నవ్వబట్టే… ఓ లచ్చ గుమ్మాడి
అతడు: పాలుదాపానాని నేను… ఓ లచ్చ గుమ్మాడి
పంతాలు పెట్టుకుంటే… ఓ లచ్చ గుమ్మాడి
పాల సేపు దుంకిపోయి… ఓ లచ్చ గుమ్మాడి
పాప నోట్లో పడ్డదమ్మో… ఓ లచ్చ గుమ్మాడి
కోరస్: నిండు అమాసనాడు ఓ లచ్చ గుమ్మడి
ఆడబిడ్డ పుట్టినాదో ఓ లచ్చ గుమ్మడి
అతడు: ఆడదాంతో అందామనిరి… ఓ లచ్చ గుమ్మాడి
మొగోడ్తో పిల్లాలనిరి… ఓ లచ్చ గుమ్మాడి
మగబిడ్డ సెయ్యని పాపం… ఓ లచ్చ గుమ్మాడి
ఆడబిడ్డలేమి జేసే… ఓ లచ్చ గుమ్మాడి
అతడు: సెత్తలో పడెయ్య బిడ్డో… ఓ లచ్చ గుమ్మాడి
బావిలో పడేయనమ్మో… ఓ లచ్చ గుమ్మాడి
వరి గింజ వేసి సంపా… ఓ లచ్చ గుమ్మాడి
ఉరిపోసి సంపుకోను… ఓ లచ్చ గుమ్మాడి
కోరస్: నిండు అమాసనాడు ఓ లచ్చ గుమ్మడి
ఆడబిడ్డ పుట్టినాదో ఓ లచ్చ గుమ్మడి
అతడు: సమ్మక్కను చేస్త… ఓ లచ్చ గుమ్మాడి
నిన్ను సారక్కనూ జేస్తా… ఓ లచ్చ గుమ్మాడి
నిన్ను ఝాన్సీలక్ష్మిని చేస్తా… ఓ లచ్చ గుమ్మాడి
నిన్ను రాణి రుద్రమ్మను జేస్తా… ఓ లచ్చ గుమ్మాడి
నిన్ను శోభక్కను చేస్తా… ఓ లచ్చ గుమ్మాడి
నిన్ను కుమారక్కను జేస్తా… ఓ లచ్చ గుమ్మాడి
అతడు:నిండు అమాసనాడు ఓ లచ్చ గుమ్మాడి
ఆడబిడ్డ పుట్టినాదో ఓ లచ్చ గుమ్మాడి
కోరస్: నిండు అమాసనాడు ఓ లచ్చ గుమ్మాడి
ఆడబిడ్డ పుట్టినాదో ఓ లచ్చ గుమ్మాడి
Comments are off this post