LYRIC
Amma Telanganama Lyrics and Singer From Gaddar Song. అమ్మ తెలంగాణమా ఆకలి కేకల గానమా అమ్మ నీకు వందానాలమ్మో కమ్మని ప్రేమా నీదమ్మో…
Amma Telanganama Lyrics
అమ్మా తెలంగాణమా ఆకలి కేకల గానమా Lyrics
అతడు: అమ్మా తెలంగాణమా ఆకలి కేకల గానమా ||2||
కోరస్: అమ్మ తెలంగాణమా ఆకలి కేకల గానమా ||2||
అతడు: అమ్మ నీకు వందానాలమ్మో
కమ్మని ప్రేమా నీదమ్మో
(అమ్మ నీకు వందానాలమ్మో
కమ్మని ప్రేమా నీదమ్మో)
ఎటోళ్ళ మట్టి చిప్పవో
ఎటోళ్ళ మట్టి చిప్పవు
గాయిదోళ్ళ గాండ్ర గొడ్డలివి
కోరస్: అమ్మ తెలంగాణమా ఆకలి కేకల గానమా ||2||
ఖమ్మం మెట్టు అడువులతోనే
కట్టుకుంది పచ్చని సీర
(కట్టుకుంది పచ్చని సీర)
ఆదిలాబాదు ఆకు నులిమి
పెట్టుకుంది నొసట బొట్టు
(పెట్టుకుంది నొసట బొట్టు)
నాగారం అడివితుమ్మతో
దిద్దుకుంది కనుల కాటిక
(దిద్దుకుంది కనుల కాటిక)
కుసుమ పువ్వులు నూరమ్మో
పసుపు పూసుకుందమ్మో
(కుసుమ పువ్వులు నూరమ్మో
పసుపు పూసుకుందమ్మో)
నిండు ముత్తైదా తెలంగాణము
ముండమోసినట్లున్నాదమ్మో
కోరస్: అమ్మ తెలంగాణమా ఆకలి కేకల గానమా ||2||
పసుపు పచ్చ ఆకుపచ్చ
నాపరాయి సూపు సూడు
(నాపరాయి సూపు సూడు)
ముదుమాణిక్యం అమృతపాళి
ముద్దు ముద్దు మొఖము సూడు
(ముద్దు ముద్దు మొఖము సూడు)
దేవుళ్ళకు మారు రూపము
నల్ల సరుకు నునుపు సూడు
(నల్ల సరుకు నునుపు సూడు)
కొంగుకు బంగారమమ్మో
సింగరేణి మందమర్రమ్మో
(కొంగుకు బంగారమమ్మో
సింగరేణి మందమర్రమ్మో)
ఎండి బంగారం దండిగ ఉన్న
ఆ, ఎండి బంగారం దండిగ ఉన్న
బోడి మెడతో బొల్లునేడ్చినది
కోరస్: అమ్మ తెలంగాణమా ఆకలి కేకల గానమా ||2||
ఆ ఆ నగలో నగా నాగన
నగలో నగా నాగన
నాగి నాగి నం నాగానో
నాగి నాగి నం నాగనో
కోరస్: అమ్మ తెలంగాణమా ఆకలి కేకల గానమా ||2||
కొమురం భీముని కొలిసి మొక్కేటి
కేస్లాపూరు జాతర జూడు
(కేస్లాపూరు జాతర జూడు)
అలిగిన సీతకు మొండి రామునికి
బంధం గలిపిన భద్రాచలము
(బంధం గలిపిన భద్రాచలము)
శివ శివ అంటు ఒక్కపొద్ధిడిసే
ఎముండాల రాజన్న రూపం జూడు
పాయలై విడిపోయే గంగ
ఏడుపాయల జాతర జూడు
(ఏడుపాయల జాతర జూడు)
బొడ్డురాళ్లకు బిడ్డలనిచ్చే
సమ్మక్క సారక్క జాతర జూడు
(సమ్మక్క సారక్క జాతర జూడు)
పోశమ్మ కాశమ్మ కాళమ్మ తల్లి
గండి మైసమ్మ కనుగుడ్లు సూడు
(గండి మైసమ్మ కనుగుడ్లు సూడు)
కొమురెల్లి మల్లన్నను సూడు
కొండేశ్వరి కల్లో దాగుండు
(కొమురెల్లి మల్లన్నను సూడు
కొండేశ్వరి కల్లో దాగుండు)
కోటి దేవుళ్ళకు దీపం బెట్టిన
భలే, కోటి దేవుళ్ళకు దీపం బెట్టిన
కూటికి లేని తల్లిని సూడు
కోరస్: అమ్మ తెలంగాణమా ఆకలి కేకల గానమా ||2||
పొద్దుగల్లనే నిద్దుర లేపే
బాలసంతల శంఖం జూడు
(బాలసంతల శంఖం జూడు)
తాంబుర బుర్రెల తందానతాన ననే
బల్గూరి కొండయ్య బుర్రకథిను
(బల్గూరి కొండయ్య బుర్రకథిను)
దె అల్లా కె నామ్ అంటు
ఫకీరు సాబుల దీవెన దేఖో
(ఫకీరు సాబుల దీవెన దేఖో)
వంగి వంగి దండం పెట్టె
గంగిరెద్దుల రంగులు జూడు
(గంగిరెద్దుల రంగులు జూడు)
డిల్లెం పల్లెం ధీమ్ ధీమనగా
గొల్లకురుమల ఒగ్గు కథమ్మో
(గొల్లకురుమల ఒగ్గు కథలమ్మో)
బుడుక్ బుడుక్ అని జెమిడికె మీద
బైండ్లోల్ల ఎల్లమ్మ కథలు
(బైండ్లోల్ల ఎల్లమ్మ కథలు)
వెన్నెల రాత్రుల కోలన్నలు
చిందులు వేసే చిరుతల భజన
(చిందులు వేసే చిరుతల భజన)
జెజ్జెన్కా జన్ దద్దన్కా ధన్
డప్పు మీద దరువులు సూడు
(డప్పు మీద దరువులు సూడు)
తీన్మార్ దెబ్బా సూడమ్మో
తీరొక్కా దరువు సూడమ్మో
(తీన్మార్ దెబ్బా సూడమ్మో
తీరొక్కా దరువు సూడమ్మో)
ఆటపాటల పల్లోయమ్మా
ఆ ఆటపాటల పల్లోయమ్మా
నోటిమారి రాని తల్లోయమ్మ
కోరస్: అమ్మ తెలంగాణమా ఆకలి కేకల గానమా ||2||
మహాతల్లీ మహాబలేశ్వరం
కృష్ణమ్మకు జన్మనిచ్చినది
(కృష్ణమ్మకు జన్మనిచ్చినది)
భారతి తుంగభద్ర
పెద్దవాగు పాలేరును
(పెద్దవాగు పాలేరును)
ఆహల్యను అలుముకున్నది
మూసినదిని ముద్దాడింది
పాలమూరు వడిలో కృష్ణ
పాడుకున్నది ఆడుకున్నది
(పాడుకున్నది ఆడుకున్నది)
నల్లగొండ గుండెల మీద
నడక నేర్సినది నాట్యమాడినది
(నడక నేర్సినది నాట్యమాడినది)
జోరు జోరుగా హోరుగ వచ్చి
జూరాల వద్ద జూలలూగినది
(జూరాల వద్ద జూలలూగినది)
శ్రీశైలం మల్లన్న జూసి
శివతాండవం చిందులేసినది
(శివతాండవం చిందులేసినది)
నందికొండ గుండెల్లో తల్లి
సల్లగా నిద్దుర పోయింది
(నందికొండ గుండెల్లో తల్లి
సల్లంగా నిద్దుర పోయింది)
కృష్ణమ్మ తల్లి తెలంగాణకు
మా కృష్ణమ్మ తల్లి తెలంగాణకు
కన్నీళ్లు తప్ప నీళ్ళివ్వలేదు
కోరస్: అమ్మ తెలంగాణమా ఆకలి కేకల గానమా ||2||
పడమటి కనుమల నాసికులోన
తల్లి గోదావరి పుట్టిన ఇల్లు
(తల్లి గోదావరి పుట్టిన ఇల్లు)
బాస జేసి బాసర వద్ద
ఆదిలాబాదులో అడుగు పెట్టినది
(ఆదిలాబాదులో అడుగు పెట్టినది)
సేతులు జాపి కిన్నెరసాని
ఎత్తుకోని ఎగరేసింది
(ఎత్తుకోని ఎగరేసింది)
మంజీరాను కిన్నెరసానిని
మనుసు నిండా దాసుకుంది
(మనుసు నిండా దాసుకుంది)
సేతులు జాపి ఎత్తుకున్నది
మూతులు తుడిసి ముద్దాడింది
(మూతులు తుడిసి ముద్దాడింది)
పోచంపాడు కాడ పొదిగిపోతనని
బాస జేసినది భరోసిచ్చినది
(బాస జేసినది భరోసిచ్చినది)
గంగమ్మకు దయరాలేదమ్మో
గంటెడు నీళ్లవ్వలేదమ్మో
(గంగమ్మకు దయరాలేదమ్మో
గంటెడు నీళ్లవ్వలేదమ్మో)
గోదావరమ్మ తెలంగాణను
మా గోదావరమ్మ తెలంగాణను
గొడ్రాలు జేసి పోయిందమ్మో
కోరస్: అమ్మ తెలంగాణమా ఆకలి కేకల గానమా ||2||
ఆ ఆ నగలో నగా నాగలో
నగలో నన నాగలో
నగనం అననం నగాన
నాగ నాగ నం నాగన
కోరస్: అమ్మ తెలంగాణమా ఆకలి కేకల గానమా ||2||
అడవితల్లి గుండెల్లోన
గోండు దారల అడుగులు సూడు
(గోండు దారల అడుగులు సూడు)
తుర్రుమామ కొండమామ
ఈకలు సూడు ఈటెలు సూడు
(ఈకలు సూడు ఈటెలు సూడు)
యాడ్యం బొడ్యం జిమ్మెకె జిమ్మే
లంబాడి సెల్లెల నాట్యం సూడు
(లంబాడి సెల్లెల నాట్యం సూడు)
చెంచోల్ల కూనలు సూడమ్మో
వాడిన అడివి పూలమ్మో
చెంచోల్ల కూనలు సూడమ్మో
వాడిన అడివి పూలమ్మో
పచ్చ పచ్చని అడవీ తల్లి
ఆ పచ్చ పచ్చని అడవీ తల్లి
నెత్తురు మడుగులు నిండ మునిగినది
కోరస్: అమ్మ తెలంగాణమా ఆకలి కేకల గానమా ||2||
నా ఆకలి కేకల గానమా
ఆకలి కేకల గానమా ||2||
Comments are off this post