LYRIC
Rangu Seethaammo Lyrics Pt 6 by Parshuram Nagam, Sung by Boddu Dilip – Lavanya, Music by Praveen Kaithoju, From Folk Song Telugu. రాంగు సీతమ్మో ఓ…ఓ
Rangu Seethaammo Lyrics Pt 6
రాంగు సీతమ్మో ఓ…ఓ… Lyrics
అతడు: గోరు ముద్దలూ వెడితి
గోడ దుంకి వస్తవేళ
గావురంగ చూసుకుంటి
గాయాబు అవుతవేళ అడుగు సీతమ్మో
ఆమె: నీకు జోడి దెస్తమమ్మ
బండెక్కి వస్తడమ్మ
బంతిపూలు తెస్తడమ్మ
గోగిపూలు ఇస్తడమ్మ నా ఈ బిడ్డో
అతడు: పగడాల దీవినుండి
రెక్కల గుర్రామెక్కి
అద్దాల మేడలోకి నిన్నెత్తుక పోతడమ్మో
సూడవె బిడ్డో
ఆమె: పిలగానితో మాట్లాడుత
అవ్వయ్యతో మాట్లాడుత
కులమతమేదైనా గాని
కోరినట్లు పెండ్లి జేస్త నడువే బిడ్డ
అతడు: నా బిడ్డ సిరి దేవి
నా బిడ్డ భూదేవి
నా బిడ్డ మారాణి
నా బిడ్డకు అంక లేదు
సూడు బావయ్యో
ఆమె: పసిపిల్లలు గాదు వీళ్ళు
పారిపోయే వాళ్ళు జూడు
పాణాలే పోతవున్నా పట్టించుకోరు వీళ్ళు
సూడు అన్నయ్యో
అతడు: సిరులిస్తా మణులిస్తా
సిరిపోలు నేను వోస్త
ఆస్తులిస్త పాస్తులిస్త
అడిగినంత కట్నమిస్త సూడు సెల్లెమ్మో
ఆమె: పనిల ఉంది నా బిడ్డ
మాటలుంది నా బిడ్డ
సదువులుంది నా బిడ్డ
సాత్రంలా ఉంది బిడ్డ ఒప్పుకోవమ్మో
అతడు: ఎక్కించే వాళ్ళుంటరు
పొంగిపోకే నా బిడ్డ
ఎత్తేసే వాళ్ళుంటరు
కుంగిపోకే ఓ బిడ్డ, జాగురత్తమ్మో
ఆమె: సుట్టాలు పక్కాలు
సూసిపోను వస్తుంటరు
ఇరుగిల్లు పొరుగిల్లు
ముచ్చటాడి పోతుంటరు, కలిసిపోవమ్మో
అతడు: తిండుంటే కండుంటది
కండుంటే పని ఉంటది
పని ఉంటే పైసుంటది
పైసుంటే ఇలువుంటది, ఇగురంగుండే
ఆమె: ఇలువుంటే బతుకుంటది
పదిమందిల తెలివుంటది
ముందుకెళ్లే తెగువుంటది
సంబరాల ఇల్లైతది నా ఈ బిడ్డో
అతడు: నువ్వుట్టినసంది బిడ్డ
లచ్చిందేవొచ్చినాదే
నువ్వేళ్ళీ పోతే బిడ్డ
నా గుండె వగిలిపాయే, నా ఈ బిడ్డో
ఆమె: కష్టంలా తోడుంటివి
నష్టంలా ఎంటుంటివి
బాధలు పంచుకుంటివి
బైలెల్లి పోవడితివే నా ఈ బిడ్డో
అతడు: పోయేకాడ ఫైలంగా
వండే కాడ ఫైలంగా
సేనుకాడ ఫైలంగా
సెలకకాడ ఫైలంగా ఉండవమ్మా
ఆమె: నలుగురిలా జాగ్రత్త
నవ్వేకాడ జాగ్రత్త
ఆటకాడ జాగ్రత్త
మాటకాడ జాగ్రత్త నా ఈ బిడ్డో
మీరు సల్లగుండాలె పిల్లపాపాలతోటి
మీరు సల్లగుండాలే……
Comments are off this post