LYRIC

Ennallila Lyrics by Bhaskara Bhatla, Music by Kalyan Nayak, Singer Anurag Kulkarni, From Writer Padmabhushan Telugu Movie Song. ఎన్నాళ్ళిలా మనసునే దాచడం ఎన్నాళ్ళిలా అడుగులే ఆపడం. ఓటమే ఒప్పుకోకురా ఒకటే అవకాశం కదా.

Ennallila Lyrics

Ennaallilaa Manasune Daachadam Lyrics

Male: Ennaallilaa Manasune Daachadam
Ennaallilaa Adugule Aapadam
Ennaallilaa Oohallone Undadam
Ennaallilaa Neelo Nuvve Nalagadam

Male: Thalupulni Moosesi Thaladhindu Thadipesthe
Ravvantha Velugaina Neevaipu Raadhe
Kanneeti Lothullo Nuv Gaani Padipothe
Ye Teeramu Neeku Kanipinchadhe

Male: Otame Oppukokuraa
Okate Avakasham Kadhaa
Raathe Maaruthundhiraa
Raayadam Modalupettu Nee Kadhaa

Male: Ye Kanchiki Poleni Kadhalenno
Nee Mundare Unnaayigaa
Nee Cheyi Thaaki Kaavyaalu Avvaali
Nee Peru Maarumogaaligaa

Male: Ee Jeevitham Neeku Gelichendhuke Undhi
Aadhaarapadipothe Chejaaruthundhi
Vijayaala Koraku Neelone Vethuku
Ye Jaali Choopulni Nuvu Korukoku

Male: Otame Oppukokuraa
Okate Avakasham Kadhaa
Raathe Maaruthundhiraa
Raayadam Modalupettu Nee Kadhaa

Male: Eelokame Kannetthi Choosthundhi
Aa Nammakam Neekundagaa
Lerevvaru Neekanni Goppollu
Aalochane Modhalavvagaa

Male: Cheemantha Kashtaanni
Padakundaa Koorchunte
Neechethikandhena Ye Chekkeraina
Nuvu Kanna Kalalu Neraveretapudu
Rettimpu Avuthundhi Gundello Baruvu

Male: Otame Oppukokuraa
Okate Avakasham Kadhaa
Raathe Maaruthundhiraa
Raayadam Modalupettu Nee Kadhaa

ఎన్నాళ్ళిలా మనసునే దాచడం Lyrics

అతడు: ఎన్నాళ్ళిలా మనసునే దాచడం
ఎన్నాళ్ళిలా అడుగులే ఆపడం
ఎన్నాళ్ళిలా ఊహల్లోనే ఉండడం
ఎన్నాళ్ళిలా నీలో నువ్వే నలగడం

అతడు: తలుపుల్ని మూసేసి తలదిండు తడిపేస్తె
రవ్వంత వెలుగైనా నీవైపు రాదే
కన్నీటి లోతుల్లో నువ్ గాని పడిపోతే
ఏ తీరము నీకు కనిపించదే

అతడు: ఓటమే ఒప్పుకోకురా
ఒకటే అవకాశం కదా
రాతే మారుతుందిరా
రాయడం మొదలుపెట్టు నీ కధా

అతడు: ఏ కంచికి పోలేని కధలెన్నో
నీ ముందరే ఉన్నాయిగా
నీ చేయి తాకి కావ్యాలు అవ్వాలి
నీ పేరు మారుమోగాలిగా

అతడు: ఈ జీవితం నీకు గెలిచేందుకే ఉంది
ఆధారపడిపోతే చేజారుతుంది
విజయాల కొరకు నీలోనే వెతుకు
ఏ జాలి చూపుల్ని నువు కోరుకోకు

అతడు: ఓటమే ఒప్పుకోకురా
ఒకటే అవకాశం కదా
రాతే మారుతుందిరా
రాయడం మొదలుపెట్టు నీ కధా

అతడు: ఈ లోకమే కన్నెత్తి చూస్తుంది
ఆ నమ్మకం నీకుండగా
లేరెవ్వరూ నీకన్న గొప్పోళ్ళు
ఆలోచనే మొదలవ్వగా

అతడు: చీమంత కష్టాన్ని పడకుండ కూర్చుంటే
నీ చేతికందేన ఏ చెక్కెరైనా
నువు కన్న కలలు నెరవేరేటపుడు
రెట్టింపు అవుతుంది గుండెల్లో బరువు

అతడు: ఓటమే ఒప్పుకోకురా
ఒకటే అవకాశం కదా
రాతే మారుతుందిరా
రాయడం మొదలుపెట్టు నీ కధా

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO